Telugu Global
Cinema & Entertainment

రూ.100 కే బ్రహ్మాస్త్ర మూవీ

రణబీర్ కపూర్, అలియాభట్ హీరోహీరోయిన్లుగా నటించిన పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర. దసరా కనుకగా ఈ సినిమా టికెట్ రేట్లు తగ్గించారు.

రూ.100 కే బ్రహ్మాస్త్ర మూవీ
X

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర మూవీకి, రిలీజైన కొత్తలో టికెట్ రేట్లు కూడా భారీగానే పెట్టారు. మల్టీప్లెక్సులో ఈ సినిమా చూడాలంటే మినిమం 250 రూపాయలు పెట్టాల్సిందే. మొత్తమ్మీద సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో ఈ ఏడాది తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది బ్రహ్మాస్త్ర.

ఇప్పుడీ సినిమాకు మరింతమంది ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు మేకర్స్ ఓ నిర్ణయం తీసుకున్నారు. కేవలం వంద రూపాయలకే ఈ భారీ గ్రాఫిక్స్ విజువల్ వండర్ ను బిగ్ స్క్రీన్ పై చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

ఇవాళ్టి నుంచి 4 రోజుల పాటు (29వ తేదీ వరకు) బ్రహ్మాస్త్ర సినిమాను వంద రూపాయలకే వీక్షించే అవకాశాన్ని కల్పించింది యూనిట్. దసరా శెలవులు మొదలవ్వడంతో, ఈ ఆఫర్ ప్రకటించినట్టు తెలిపిన యూనిట్.. బ్రహ్మాస్త్రను థియేటర్లలో చూసి నవరాత్రుల్ని మరింత కలర్ ఫుల్ గా మార్చుకోమని ఆఫర్ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ లో ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే టికెట్ ధరపై అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వంద రూపాయల టికెట్ కాస్తా 112 రూపాయలు అవుతుందన్నమాట. తెలుగు వెర్షన్, హిందీ వెర్షన్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో, అన్ని స్క్రీన్స్ లో ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.

First Published:  26 Sep 2022 3:37 AM GMT
Next Story