Telugu Global
Cinema & Entertainment

బ్రహ్మానందం కొడుకు మరో విశ్వప్రయత్నం

బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్, మరో సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈసారి మరో కొత్త కథ సెలక్ట్ చేసుకున్నాడు ఈ నటుడు

బ్రహ్మానందం కొడుకు మరో విశ్వప్రయత్నం
X

చాన్నాళ్లుగా బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నాడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్. కానీ ఇప్పటివరకు సరైన విజయం అందుకోలేకపోయాడు. కనీసం నలుగురు గుర్తించే సినిమా కూడా చేయలేకపోయాడు. దీంతో బాగా సినిమాలు తగ్గించేసిన ఈ నటుడు, ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తున్నాడు.

అనిల్ మోదుగ ఫిలిమ్స్ బ్యానర్ పై కొత్త సినిమా చేస్తున్నాడు రాజా గౌతమ్. ఈ సినిమాకు సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి బ్రేక్ అవుట్ అనే టైటిల్ పెట్టారు.

సర్వైవల్ థ్రిల్లర్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. కిటికీ నుండి బయటికి చూస్తూ బిగ్గరగా అరుస్తున్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్, సినిమాపై క్యురియాసిటీని పెంచింది.

ఈ సినిమా కచ్చితంగా తనకు బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాడు రాజా గౌతమ్. ఇదొక కాన్సెప్ట్ మూవీ. చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి ఇతర కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి.. జోన్స్ రూపర్ట్ సంగీతం సమకూరుస్తున్నాడు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలతో పాటు, విడుదల తేదీని కూడా ప్రకటించబోతున్నారు.

First Published:  27 Aug 2022 1:35 PM GMT
Next Story