Telugu Global
Cinema & Entertainment

Brahma Anandam | బ్రహ్మానందం, రాజా గౌతమ్ సినిమా

Brahma Anandam - రియల్ లైఫ్ తండ్రీకొడుకులు బ్రహ్మానందం, గౌతమ్ కలిసి సినిమా చేయబోతున్నారు. దీని పేరు బ్రహ్మ ఆనందం.

Brahma Anandam | బ్రహ్మానందం, రాజా గౌతమ్ సినిమా
X

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి ఓ సినిమా చేయనున్నారు. నిజజీవిత తండ్రీ కొడుకులు తాత, మనవళ్లుగా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు నిఖిల్ దర్శకత్వం వహించనున్నారు. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వంద శాతం సక్సెస్ రేట్‌తో న్యూ ఏజ్ కంటెంట్ బేస్డ్ సినిమాలను రూపొందిస్తోంది. వారి గత చిత్రాలు మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందించాయి. వారి బ్యానర లో 5వ ప్రొడక్షన్‌గా వైబ్ చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు. వారి ప్రొడక్షన్ నెంబర్ 4 గా 'బ్రహ్మ ఆనందం' ను ఆహ్లాదకరమైన ప్రీ-లుక్ పోస్టర్, వీడియోతో అనౌన్స్ చేశారు.

ప్రీ లుక్ పోస్టర్ పట్టణ, గ్రామీణ సంస్కృతుల సమ్మేళనం. గౌతమ్ తదుపరి చిత్రం గురించి బ్రహ్మానందం, వెన్నెల కిషోర్ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణను వీడియో ప్రజెంట్ చేస్తోంది. వెన్నెల కిషోర్, బ్రహ్మానందంకి గౌతమ్ సినిమా చేయడానికి అనుమతి ఇచ్చాడని చెప్పారు. తాత పాత్రలో నటించడానికి అంగీకరించమని ఇద్దరూ లెజండరీ హాస్యనటుడిని అభ్యర్థించారు. బ్రహ్మీ, గౌతమ్‌ల పాత్రలని బ్రీఫ్ చేసే ఈ హిలేరియస్ వీడియో సినిమాపై ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది.

వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌కల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది డిసెంబర్ 6న బ్రహ్మా ఆనందం చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

First Published:  8 May 2024 5:36 PM GMT
Next Story