Telugu Global
Cinema & Entertainment

లాంగ్ గ్యాప్ తర్వాత తెరపైకొచ్చిన హీరో

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత తెరపైకొచ్చాడు బ్రాడ్ పిట్. అతడు నటించిన బుల్లెట్ ట్రయిన్ సినిమా తాజాగా థియేటర్లలోకి వచ్చింది.

లాంగ్ గ్యాప్ తర్వాత తెరపైకొచ్చిన హీరో
X

ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటుడు బ్రాడ్ పిట్ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెండితెరపైకి వచ్చాడు. బ్రాడ్ పిట్ నటించిన భారీ యాక్షన్-కామెడీ చిత్రం 'బుల్లెట్ ట్రైన్'. ఈ చిత్రం ఆగస్ట్ 4న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజైన ఈ సినిమాలో, బ్రాడ్ పిట్ ను చూసేందుకు అతడి అభిమానులు ఎగబడ్డారు.

ట్రాయ్, మిస్టర్ & మిసెస్ స్మిత్ వంటి బ్లాక్ బస్టర్ అవార్డ్ విన్నింగ్ సినిమాలలో తన మాజీ భార్య ఏంజెలీనా జోలీ తో కలిసి నటించాడు పిట్. ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్, టరాన్టినోస్ ఇన్-గ్లోరియస్ బాస్టర్డ్స్, మనీబాల్, ఓషన్స్ – ఓషన్స్ ఎలెవెన్, ట్వెల్వ్ వంటి బ్లాక్ బస్టర్ అవార్డ్ విన్నింగ్ చిత్రాలలో నటించి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.

తన తాజా చిత్రం బుల్లెట్ ట్రైన్‌తో మరోసారి అదే మ్యాజిక్‌ను తెరపైకి తీసుకువచ్చాడు బ్రాడ్ పిట్. ఇతడికి ఇండియాలో కూడా అభిమానులున్నారు. ఇండియన్ మల్టీప్లెక్సుల్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

సూపర్‌సోనిక్ స్పీడ్, హై-ఆక్టేన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో, బ్రాడ్ పిట్ నటన తో ఈ చిత్రం పూర్తిగా థ్రిల్లింగ్‌గా తెరకెక్కింది. హాస్యభరితంగా కూడా ఉంటుందని యూనిట్ చెబుతోంది. డెడ్‌పూల్ 2 దర్శకుడు డేవిడ్ లీచ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రచయిత కోటారో ఇసాకా రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కింది.



First Published:  6 Aug 2022 7:29 AM GMT
Next Story