Telugu Global
Cinema & Entertainment

Boycott: మరోసారి బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్

Boycott Bollywood: ఇప్పుడీ ట్రెండ్ షారూక్ సినిమాపై కూడా పడింది. షారూక్ తాజా చిత్రం పఠాన్ ను నిషేధించాలంటూ సోషల్ మీడియాలో చాలా రచ్చ జరుగుతోంది.

Boycott: మరోసారి బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్
X

బాలీవుడ్ లో మరోసారి బాయ్ కాట్ ట్రెండ్ మొదలైంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం నుంచి మొదలైన ఈ ట్రెండ్, పెద్ద సినిమా రిలీజైన ప్రతిసారి తెరపైకొస్తోంది. తాజాగా షారూక్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రచారం ఇలా మొదలైందో లేదో అలా బాయ్ కాట్ పఠాన్ అనే ట్రెండ్ షురూ అయింది.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజైంది. అందులో హీరోయిన్ దీపికా పదుకోన్ అందాలు ఆరబోసింది. ఆ క్లిప్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, మరోవైపు సౌతిండియా సినిమాల్లో పద్ధతిగా కనిపించే హీరోయిన్ల క్లిప్స్ ను ట్యాగ్ చేస్తూ.. ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు బాలీవుడ్ జనం.

ఇక్కడితో ఆగకుండా షారూక్ ఖాన్ గతంలో చేసిన పొరపాట్లు, వివాదాస్పద అంశాల్ని మరోసారి తెరపైకి తెస్తూ బాయ్ కాట్ ట్రెండ్ ను కొనసాగిస్తున్నారు. వీటికి తోడు సుశాంత్ సింగ్ ఉదంతాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఇలా పఠాన్ సినిమా చుట్టూ ఎంత నెగెటివిటీ క్రియేట్ చేయాలో అంతా చేస్తున్నారు.

లాంగ్ గ్యాప్ తర్వాత షారూక్ ఖాన్ చేస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాను జనవరి 25న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.



First Published:  14 Dec 2022 8:30 AM GMT
Next Story