Telugu Global
Cinema & Entertainment

Balakrishna | మరోసారి బాలయ్యతో బోయపాటి సినిమా..?

Balakrishna - బాలయ్య-బోయపాటిది హిట్ కాంబినేషన్. ఇప్పటికే ఇద్దరూ కలిసి హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు మరో మూవీకి సిద్ధమౌతున్నారు.

Balakrishna | మరోసారి బాలయ్యతో బోయపాటి సినిమా..?
X

బాలకృష్ణ, బోయపాటి కలిసి ఎప్పుడు సినిమా చేసినా హిట్టే. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం, బాలకృష్ణ మళ్లీ బోయపాటి శ్రీనుతో చేతులు కలిపాడు.

బాలకృష్ణ ప్రస్తుతం బాబీతో చేస్తున్న సినిమాను వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత బాలకృష్ణ మళ్లీ బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తాడనే టాక్ నడుస్తోంది. ఈ హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాంబో తమ 4వ చిత్రాన్ని 14 రీల్స్ బ్యానర్ లో చేయబోతోంది.

గతంలో ఈ ముగ్గురూ లెజెండ్ సినిమా కోసం కలిసి పనిచేశారు. అయితే బోయపాటి, బాలయ్య కాంబోలో రాబోతున్న 4వ సినిమా అఖండకు సీక్వెల్ అవుతుందా, లేక పొలిటికల్ సినిమా అవుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

అల్లు అర్జున్‌తో బోయపాటి సినిమా చేసే ఛాన్స్ ఉందని అంతా అనుకున్నారు. కానీ ఐకాన్ స్టార్ అట్లీని ఎంచుకున్నాడు. స్కంద ఫెయిల్యూర్ తర్వాత బాలకృష్ణ మాత్రమే బోయకు సక్సెస్ ఇవ్వగలడని, ఈ వేసవి తర్వాత ఈ కొత్త సినిమా కార్యరూపం దాల్చుతుందని అందరూ భావించారు. వీళ్ల కాంబినేషన్ లో ఇప్పటివరకు వచ్చిన సింహా, లెజెండ్, అఖండ సినిమాలు మూడూ హిట్టయ్యాయి.

First Published:  11 Jan 2024 4:47 PM GMT
Next Story