Telugu Global
Cinema & Entertainment

అదిరిపోతున్న ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్లు!

నిన్న విడుదలైన ప్రభాస్ ‘కల్కి -2898 ఏడీ’ మిథికల్ ఫాంటసీ మూవీ రికార్డు బ్రేక్ కలెక్షన్లు సాధించింది. దేశంలో ఫస్ట్ డే కలెక్షన్లలో ఆల్-టైమ్ రికార్డులు సాధించిన సినిమాల్లో నాల్గవదిగా నిలిచింది.

అదిరిపోతున్న ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్లు!
X

నిన్న విడుదలైన ప్రభాస్ ‘కల్కి -2898 ఏడీ’ మిథికల్ ఫాంటసీ మూవీ రికార్డు బ్రేక్ కలెక్షన్లు సాధించింది. దేశంలో ఫస్ట్ డే కలెక్షన్లలో ఆల్-టైమ్ రికార్డులు సాధించిన సినిమాల్లో నాల్గవదిగా నిలిచింది. ప్రభాస్ నటించిన సినిమాల్లో 'బాహుబలి 2' తర్వాత రెండవ అతిపెద్ద ఓపెనర్ గా నమోదైంది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి 2’ తొలిరోజు 121 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలోనే ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రారంభ రోజు రూ. 133 కోట్లతో టాప్ ఓపెనర్‌గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ‘కేజీఎఫ్ 2’ రూ. 116 కోట్లు, ప్రభాస్ నటించిన 'సాహో', 'సాలార్’ లు రూ. 89 కోట్లు, రూ. 90 కోట్లూ వసూలు చేసి 3వ, 4వ, 5 వ స్థానాల్ని ఆక్రమిస్తే, ఇప్పుడు రూ. 95 కోట్లతో ‘కల్కి’ వచ్చేసి నాల్గవ స్థానాన్ని ఆక్రమించింది.

ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ (రూ. 86.75 కోట్లు) కూడా ‘కల్కి’ ముందు ఆగలేదు. ఇండియాలో అన్ని భాషలూ కలిపి ‘కల్కి’ మొదటి రోజు రూ. 95 కోట్లు రాబట్టు కుంది. గత సంవత్సరం విడుదలైన షారూఖ్ ఖాన్ ‘జవాన్’ ఫస్ట్ డే కలెక్షన్లు (రూ. 65.5 కోట్లు) ని సైతం వెనక్కి తోసేసింది. బాక్సాఫీసు ట్రాకింగ్ వెబ్సైట్ సాచ్నిక్ ప్రకారం, తెలుగులో రూ. 64.5 కోట్లు, తమిళంలో రూ. 4 కోట్లు, హిందీలో రూ. 24 కోట్లు, మలయాళంలో రూ. 2.2 కోట్లూ వసూలు చేసింది.

‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటించిన ‘కల్కి’ బాక్సాఫీసుకి బిగ్ బ్యాంగ్ నిస్తూ ప్రారంభమైంది. ఇంతే కాదు, ఉత్తర అమెరికాలో అతిపెద్ద ప్రీమియర్‌ షోలని కూడా సాధించింది. ప్రీమియర్ రోజున 3.65 మిలియన్ డాలర్లు(రూ. 30.50 కోట్లు) వసూలు చేసి ‘ఆర్ ఆర్ ఆర్’ ని అధిగమించింది. 'కల్కి- 2898 ఏడీ’ ఈ నాలుగు రోజుల ప్రారంభ వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల భారీ బెంచ్‌మార్క్ ని దాటడం ఒక్కటే ఇప్పుడు మిగిలింది. ఇప్పటికే మొదటి రోజు తర్వాత ప్రపంచవ్యాప్తంగా రూ. 180 కోట్ల గ్రాస్ సాధించింది.

‘కల్కి 2898 ఏడీ’ 2 డీ తో బాటు 3డీ, 4 డీఎక్స్, ఇమాక్స్, హెచ్ ఎఫ్ ఆర్, డాల్బీ విజన్ మొదలైన బహుళ ప్రీమియం ఫార్మాట్ లలో విడుదలైంది. దీని ఆంధ్రా, తెలంగాణా పంపిణీ హక్కుల్ని అన్నపూర్ణ స్టూడియోస్ రూ. 145 కోట్లకి పొందింది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ పంపిణీ హక్కుల్ని పొందింది. తమిళనాడులో శ్రీలక్ష్మీ ఫిలిమ్స్, కర్ణాటకలో కేవీఎన్ ప్రొడక్షన్స్ కొనుగోలు చేశాయి. బ్రిటన్ లో డ్రీమ్జ్ ఎంటర్‌టైన్‌మెంట్, మిగిలిన యూరప్‌లో ది విలేజ్ గ్రూప్ పంపిణీ హక్కులు పొందాయి. ఉత్తర అమెరికాలో ఏఏ క్రియెషన్స్, సింగపూర్ లో విజన్ సింగపూర్, మలేషియాలో సురయా ఫిలిమ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో మైండ్ బ్లోయింగ్ ఫిలిమ్స్, శ్రీలంకలో ఈఏపీ ఫిలిమ్స్ పంపిణీ హక్కులు పొందిన వాటిలో వున్నాయి.

ప్రీ రిలీజ్ బిజినెస్ పరిశీలిస్తే, శాటిలైట్, డిజిటల్, మ్యూజిక్, థియేట్రికల్ హక్కుల విక్రయాలతో తో రూ. 600 కోట్లు సమకూరినట్టు తెలుస్తోంది. ఇది సినిమా నిర్మాణ బడ్జెట్ తో సమానం. దీంట్లో రూ. 390 కోట్లు థియేట్రికల్ హక్కుల నుంచే వచ్చాయి. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల్ని అమెజాన్ ప్రీమ్ వీడియో, శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ కొనుగోలు చేశాయి.

మరి ప్రభాస్ పారోషికమెంత? రూ. 80 కోట్లు అడ్వాన్స్ ప్లస్ బిజినెస్ లో వాటా. అమితాబ్ బచ్చన్ రూ. 20 కోట్లు, కమల్ హాసన్ రూ. 20 కోట్లు, దీపికా పదుకొనే రూ, 20 కొట్లూ పారితోషికాలు పొందారు. దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు అశ్వనీ దత్, ప్రియాంకా దత్, ప్రియా దత్ లు 2018 లో ‘మహానటి’ తర్వాత ఒక విజయవంతమైన పానిండియా చలన చిత్రా రాజాన్ని జాతికి అందించారు.

First Published:  28 Jun 2024 11:30 AM GMT
Next Story