Telugu Global
Cinema & Entertainment

Bollywood: ఇక బాలీవుడ్ తో పానిండియా హోరాహోరీ

Bollywood Pan India Movies: 2023 లో సౌత్ నుంచి పానిండియా సినిమాల వెల్లువ బాలీవుడ్ ని ముంచెత్తనుంది.

Bollywood: ఇక బాలీవుడ్ తో పానిండియా హోరాహోరీ
X

Bollywood: ఇక బాలీవుడ్ తో పానిండియా హోరాహోరీ

2023 లో సౌత్ నుంచి పానిండియా సినిమాల వెల్లువ బాలీవుడ్ ని ముంచెత్తనుంది. అయితే బాలీవుడ్ ఒక హెచ్చరిక విసురుతోంది. బాలీవుడ్ కూడా స్టార్ల, సూపర్ స్టార్ల భారీ సినిమాలతో 2023 ని చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ దెబ్బతో పానిండియా సినిమాలతో తాడో పేడో తేల్చుకోవాలని చూస్తోంది. ఇప్పుడు సమస్య వరస కడుతున్న సౌత్ పానిండియా సినిమాల మధ్య బాలీవుడ్ సినిమాలకి స్పేస్ ఎలా అని కాదు, బాలీవుడ్ సినిమాల విడుదలల తిరునాళ్ళలో మూడు భాషల్లో 18 సౌత్ పానిండియాలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ ఎలా విడుదలవుతాయా అన్నది. డేట్లు, థియేటర్లు ఎలా అడ్జస్టు అవుతాయన్నది.

ఒకటి కాదు రెండు కాదు, 18 పానిండియాలు 2023 లో విడుదలకి సిద్ధమవుతు

న్నాయంటే ట్రెండ్ ని ఏ స్థాయికి తీసికెళ్తున్నారో అర్ధమవుతోంది. ఇక ఓటీటీ కంపెనీలు వందలాది కోట్ల రూపాయలు సిద్ధం చేసి పెట్టుకోవాల్సిందే పానిండియా + బాలీవుడ్ సినిమాల కోసం. ‘కాంతారా’ ఎఫెక్టు తో కన్నడలో చిన్న హీరోలు కూడా మేము సైతం అంటున్నారు. ఈ సంవత్సరం కన్నడ నుంచి చిన్న హీరోల సినిమాలే వున్నాయి. ‘క్రాంతి’ తో దర్శన్, ‘కబ్జా’ తో ఉపేంద్ర -కిచ్చా సుదీప్ లు, ‘భగీరా’ తో శ్రీ మురళి, ‘మార్టిన్’ తో ధృవ సర్జా, మరొక పేరు పెట్టని ఉపేంద్ర సినిమా మొత్తం కలిపి 5 సినిమాలు. ఇవి కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ 5 భాషల్లో విడుదలవుతున్నాయి. ‘కబ్జా’ రెండడుగులు ముందుకెసి మరాఠీ, బెంగాలీ లలో కూడా విడుదలవుతోంది.

తెలుగు నుంచి- పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ప్రభాస్ ‘ఆదిపురుష్’, ‘సాలార్’, ‘ప్రాజెక్ట్ కె’, అల్లు అర్జున్ ‘పుష్ప 2’, రామ్ చరణ్ ‘ఆర్సీ 15’, నాని ‘దసరా’. తమిళం నుంచి -రజనీకాంత్ ‘జైలర్’, కమలహాసన్ ‘భారతీయుడు 2’, విక్రమ్ ‘పొన్నియిన్ సెల్వన్ 2’, ‘తంగలన్’, సూర్య ‘సూర్య 45’, అరుణ్ విజయ్ ‘బోర్డర్’.

ఇలా సౌత్ పానిండియాలు 18 రెడీ అవుతూంటే బాలీవుడ్ ని పూర్వవైభవానికి తీసుకురావడానికన్నట్టుగా దిగ్విజయంగా ‘పఠాన్’ తో ప్రారంభోత్సవం జరిగింది. ఈ సంవత్సరమే ఇంకో రెండు షారుఖ్ ఖాన్ సినిమాలు రాబోతున్నాయి. సల్మాన్ ఖాన్ తో రెండు రాబోతున్నాయి. మొత్తం కలిపి 15 సినిమాలతో పోటీ నివ్వబోతోంది బాలీవుడ్

1. జవాన్ : అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ యాక్షన్ థ్రిల్లర్ లో కూడా మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తాడు. ఇందులో యనతార, విజయ్ సేతుపతి, సా న్యా మల్హోత్రా ఇతర తారాగణం.

2. డంకీ : షారుఖ్ ఖాన్ తొలిసారిగా రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో నటిస్తున్న సోషల్ కామెడీ. తాప్సీ హీరోయిన్.

3. టైగర్ 3 : సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ లతో దర్శకుడు మనీష్ శర్మ గూఢచార థ్రిల్లర్‌. ఇందులో ఇమ్రాన్ హష్మీన విలన్.

4. కిసీ కా భాయ్ –కిసీ కీ జాన్ : అజిత్ కుమార్ -తమన్నాల 2014 లో వచ్చిన తమిళ ‘వీరమ్’ రీమేక్ (తెలుగులో ‘ కాటమరాయుడు’). ఇందులో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే నటిస్తున్నారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం.

5. రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ : రణ్‌వీర్ సింగ్‌ -ఆలియా భట్ లతో కరణ్ జోహర్ దర్శకత్వంలో రోమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఇంకా ఇందులో సీనియర్లు జయా బచ్చన్, ధర్మేంద్ర, షబానా అజ్మీ కూడా కూడా నటిస్తున్నారు.

6. యానిమల్ : రణబీర్ కపూర్ తో ‘కబీర్ సింగ్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సినిమా. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇందులో రశ్మికా మందన్న హీరోయిన్. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతర తారాగణం.

7. బడే మియా ఛోటే మియా : టైగర్ జిందా హై , సుల్తాన్ , భారత్ వంటి హిట్స్ తీసిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమారన్‌ లు హీరోలు.

8. షెహజాదా : ‘భూల్ భూలయ్యా 2’ తో సూపర్ హిట్టిచ్చిన అప్ కమింగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్, ‘అల వైకుంఠపురములో’ రీమేక్ లో నటిస్తున్నాడు. కృతీ సానన్‌ హీరోయిన్. రోహిత్ ధావన్ దర్శకత్వం.

9. తూ ఝూటీ - మై మక్కార్ : ప్రఖ్యాత నిర్మాత లవ్ రంజన్ ద్దర్శకత్వంలో రణబీర్ -శ్రద్ధా కపూర్ లతో రోమాంటిక్ కామెడీ.

10. సత్యప్రేమ్ కీ కథా : ‘భూల్ భూలయ్యా 2’ హిట్ జంట కార్తీక్ ఆర్యన్- కియారా లతో సమీర్ విద్వాన్స్ దర్శకత్వంలో రోమాంటిక్ కామెడీ.

11. శామ్ బహదూర్ : మేఘనా గుల్జార్ దర్శకతంలో యాక్షన్ స్టార్ విక్కీ కౌశల్ వార్ డ్రామా. 1971 ఇండో- పాక్ యుద్ధం గెలుపుకు కారణమైన ఆర్మీ చీఫ్ శామ్ మానెక్ షా బయోపిక్.

12. భోలా : తమిళ యాక్షన్ ‘ఖైదీ’ రీమేక్ లో అజయ్ దేవగణ్ నటిస్తున్న ఈ మూవీలో టబు హీరోయిన్. దర్శకత్వం అజయ్ దేవగణ్.

ఈ 12 బాలీవుడ్ సినిమాలతో 18 పానిండియా సినిమాలు తలపడాల్సి వుంది. గత రెండు మూడేళ్ళ పానిండియా సినిమాల తాకిడితో తలపడి ఓడిన బాలీవుడ్ ఇప్పుడు బరి గీసి రమ్మంటోంది. మొత్తం 30 సినిమాలు అంటే నెలకు రెండున్నర సినిమాలు చూడాల్సిన బరువు బాధ్యతలు ప్రేక్షకుల మీద వుంటాయి అధిక టికెట్ రేట్లతో. ఈ సినిమాలన్నీ తేదీలు ఎలా అడ్జస్టవుతాయో ఇదో పెద్ద చిక్కు ప్రశ్న.

First Published:  28 Jan 2023 11:13 AM GMT
Next Story