Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: చిరంజీవి సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్

చిరంజీవి సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్ వచ్చింది. ఈ సారి బాబీ సింహా వంతు.

Waltair Veerayya: చిరంజీవి సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్
X


చిరంజీవి హీరోగా నటిస్తున్న మాస్ మూవీ 'వాల్తేరు వీరయ్య'. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

'వాల్తేరు వీరయ్య'లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ బాబీ సింహా ఓ కీలక పాత్ర పోస్తున్నాడు. బాబీ సింహా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ''సోలమన్ సీజర్''గా చిత్రంలోని ఆయన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఫస్ట్ లుక్ పోస్టర్ లో బాబీ సింహ లుక్ బాగుంది. వింటేజ్ లుక్ లో కనిపించిన బాబీ సింహ, వాల్తేరు వీరయ్య లో ''సోలమన్ సీజర్''గా కీలక పాత్ర పోషించినట్టు కనిపిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్, రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వస్తోంది వాల్తేరు వీరయ్య సినిమా.

First Published:  7 Nov 2022 7:40 AM GMT
Next Story