Telugu Global
Cinema & Entertainment

కల్యాణ్ రామ్ కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్

నిన్న రిలీజైన బింబిసార సినిమా కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయి

కల్యాణ్ రామ్ కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్
X

చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు కల్యాణ్ రామ్. ఎన్నో సినిమాలు చేశాడు, మంచి హిట్స్ కొట్టాడు. అయితే అవన్నీ ఒకెత్తు, బింబిసార ఒక్కటి మరో ఎత్తు. కల్యాణ్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఈ మూవీ. నిన్న రిలీజైన ఈ సినిమాకు మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 6 కోట్ల 27 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

ఈ సినిమాను ఏపీ,నైజాంలో 13 కోట్ల రూపాయలకు అమ్మారు. తొలి రోజే సగం బ్రేక్ ఈవెన్ సాధించినట్టయింది. ట్రేడ్ అంచనా ప్రకారం.. ఈ వీకెండ్ గడిచేసరికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.

కల్యాణ్ రామ్ కెరీర్ లో ఇప్పటివరకు ఇజం సినిమా మాత్రమే బిగ్గెస్ట్ ఓపెనర్. ఆ సినిమాను బింబిసారుడు క్రాస్ చేశాడు. వశిస్ఠ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మొదటి రోజు బింబిసార బ్రేకప్ ఇలా ఉంది. (షేర్ వాల్యూస్)

నైజాం - 2.12 కోట్లు (జీఎస్టీతో కలిపి)

సీడెడ్ - 1.30

వైజాగ్ - 0.90 (జీఎస్టీతో కలిపి)

ఈస్ట్ - 43 లక్షలు

వెస్ట్ - 36 లక్షలు

కృష్ణా - 34 లక్షలు

గుంటూరు - 57 లక్షలు

నెల్లూరు - 26 లక్షలు

First Published:  6 Aug 2022 12:37 PM GMT
Next Story