Telugu Global
Cinema & Entertainment

బింబిసార మొదటి వారాంతం వసూళ్లు

సక్సెస్ ఫుల్ గా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది బింబిసార. ఈ 3 రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడంతో పాటు, లాభాల్లోకి ఎంటరైంది.

బింబిసార మొదటి వారాంతం వసూళ్లు
X

బింబిసార సినిమా సరికొత్త రికార్డ్ సృష్టించింది. విడుదలైన 3 రోజుల్లోనే ఈ సినిమా లాభాల్లోకి ఎంటరైంది. తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా, రిలీజైన 3 రోజుల్లో (ఫస్ట్ వీకెండ్) ఏకంగా 15 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ సాధించింది. కల్యాణ్ రామ్ కెరీర్ 3 రోజుల్లో లాభాల్లోకి ఎంటరైన ఈ సినిమా ఇదే. అంతేకాదు, రీసెంట్ రిలీజెస్ లో ఈ ఫీట్ సాధించిన మూవీ కూడా ఇదే.

నిన్నటి వసూళ్లతో నైజాం, సీడెడ్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసింది. ఇదే ఊపు కొనసాగితే, ఈ వారాంతానికి సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు రావడంతో, ఓవరాల్ గా బింబిసార బ్లాక్ బస్టర్ అయింది.

తెలుగు రాష్ట్రాల్లో బింబిసార సినిమాకు వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం - 5.66 కోట్లు

సీడెడ్ - 3.38 కోట్లు

ఉత్తరాంధ్ర - 2.26 కోట్లు

ఈస్ట్ - 1.02 కోట్లు

వెస్ట్ - 73 లక్షలు

గుంటూరు - 1.27 కోట్లు

నెల్లూరు - 50 లక్షలు

కృష్ణా - 88 లక్షలు

First Published:  8 Aug 2022 8:01 AM GMT
Next Story