Telugu Global
Cinema & Entertainment

బింబిసార 2 రోజుల వసూళ్లు.. దాదాపుగా బ్రేక్ ఈవెన్

మొదటి రోజే సగం బ్రేక్ ఈవెన్ సాధించింది బింబిసార సినిమా. ఈరోజు కల్యాణ్ రామ్ సినిమా లాభాల్లోకి ప్రవేశించింది.

బింబిసార 2 రోజుల వసూళ్లు.. దాదాపుగా బ్రేక్ ఈవెన్
X

టాలీవుడ్ లేటెస్ట్ హిట్ బింబిసార ఊహించని విధంగా 2 రోజులకే దాదాపు బ్రేక్ ఈవెన్ సాధించింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా, ఇవాళ్టి వసూళ్లతో లాభాల బాట పట్టబోతోంది. విడుదలైన 2 రోజుల్లో ఈ సినిమాకు 10 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఏపీ,నైజాంలో 13 కోట్ల రూపాయలకు ఈ సినిమా అమ్మారు. సో.. 2 రోజుల్లోనే దాదాపు 80శాతం రికవరీ సాధించింది బింబిసార. ఇవాళ్టి వసూళ్లతో ఈ సినిమా ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వబోతోంది.

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల 27 లక్షల రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, రెండో రోజు 4 కోట్ల 52 లక్షల రూపాయలు కలెక్ట్ చేసింది. నైజాంలో ఈ సినిమా రైట్స్ ను దిల్ రాజు 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేస్తే, 2 రోజుల్లోనే 3 కోట్ల 92 లక్షల రూపాయలొచ్చాయి. అటు సీడెడ్ లో రెండున్నర కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోగా.. 2 రోజులకే 2 కోట్ల 24 లక్షల రూపాయలొచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో బింబిసార సినిమాకు 2 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం - 3.92 కోట్లు

సీడెడ్ - 2.24 కోట్లు

ఉత్తరాంధ్ర - 1.55 కోట్లు

ఈస్ట్ - 70 లక్షలు

వెస్ట్ - 55 లక్షలు

గుంటూరు - 89 లక్షలు

నెల్లూరు - 38 లక్షలు

కృష్ణా - 59 లక్షలు

First Published:  7 Aug 2022 6:59 AM GMT
Next Story