Telugu Global
Cinema & Entertainment

Kalki Movie | కల్కి సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్

Amitabh Kalki Movie - ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు బిగ్ బి. ఆయన లుక్ ను తాజాగా విడుదల చేశారు.

Kalki Movie | కల్కి సినిమా నుంచి మరో ఫస్ట్ లుక్
X

ప్రభాస్, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ కలయికలో వస్తున్న బిగ్గెస్ట్ మూవీ కల్కి. మైథాలజీని బేస్ చేసుకొని, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు లుక్స్ విడుదయ్యాయి. టీజర్ కూడా వచ్చేసింది. ఈరోడు బిగ్ బి అమితాబ్ బచ్చన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈరోజు అమితాబ్ పుట్టినరోజు, అందుకే ఇలా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

పోస్టర్ లో అమితాబ్ బచ్చన్ ఒక గుహలో తన ముఖాన్ని గుడ్డతో కప్పి, చేతిలో కర్రతో నిలబడి ఉన్న సాధువుగా కనిపించారు. అతని గెటప్, దాని వెనక ఉన్న బ్యాక్ డ్రాప్ బాగుంది. బిగ్ బి కీలక పాత్ర పోహిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని కూడా ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ 2023 శాన్ డియాగో కామిక్-కాన్‌లో లాంచ్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికీ ఈ గ్లింప్స్ కు యూట్యూబ్ లో లైక్స్, హిట్స్ వస్తూనే ఉన్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముందుగా సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్నారు. కానీ టైమ్ సరిపోవడం లేదు. అందుకే సంక్రాంతి బరి నుంచి సినిమాను తప్పించారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామంటున్నారు మేకర్స్.

కల్కి సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు. అతడి లుక్ తో పాటు, టీజర్ కూడా రిలీజైన సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ లో ప్రభాస్ ఓ సినిమా చేయడం ఇదే తొలిసారి. పాన్ వరల్డ్ మూవీగా, దాదాపు 15కు పైగా భాషల్లో కల్కి సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.




First Published:  11 Oct 2023 3:21 PM GMT
Next Story