Telugu Global
Cinema & Entertainment

బింబిసార రాంగ్ స్టెప్

5న థియేటర్లలోకి వస్తోంది బింబిసార. అయితే కాస్త ముందుగానే ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ చేయడం ఇబ్బందిగా మారింది.

బింబిసార రాంగ్ స్టెప్
X

థియేట్రికల్ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉంది. ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమాల్ని ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ మాట దేవుడెరుగు, ఫస్ట్ వీకెండ్ వసూళ్లు కూడా దారుణంగా ఉన్నాయి. ఆక్యుపెన్సీ 50శాతం ఉంటే ఘనమైన విషయంగా మారిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బింబిసార యూనిట్ ఓ రాంగ్ స్టెప్ వేసింది.

5వ తేదీన థియేటర్లలోకి వస్తోంది బింబిసార సినిమా. సెన్సార్ ఆల్రెడీ పూర్తవ్వడంతో, ఈ సినిమాకు కాస్త ముందరగా అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేశారు. 5వ తేదీ సినిమాకు నిన్నట్నుంచే ఆన్ లైన్ బుకింగ్స్ మొదలయ్యాయి. చాలా టైమ్ ఉండడంతో టికెట్లు అస్సలు తెగలేదు. ప్రసాద్స్ ఐమ్యాక్స్ లో వేస్తున్న 8.45 నిమిషాల షో, అంతకంటే ముందు వేయబోయే కూకట్ పల్లి 7 గంటల షోకు మాత్రమే ఓ మోస్తరుగా స్పందన కనిపిస్తోంది. మిగతా థియేటర్లలో ఎక్కడా బుకింగ్స్ కూడా మొదలవ్వలేదు.

దీంతో బింబిసారకు కరువైన స్పందన అంటూ కొన్ని సైట్లలో ఆల్రెడీ కథనాలు మొదలైపోయాయి. నిజం చెప్పాలంటే, ఈ సినిమాకు అంతోఇంతో మంచి బజ్ ఉంది. సాంగ్స్ పెద్దగా క్లిక్ అవ్వకపోయినా, ట్రయిలర్ ప్రామిసింగ్ గా ఉంది. సినిమా కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్న మాట వాస్తవం. కానీ ఇంతకుముందు రోజుల్లా ఎగబడే పరిస్థితి పోయింది.

మొదటి రోజు కొంతమంది వెళ్తారు, వాళ్లు చూసి బాగుందని చెబుతే, ఆ తర్వాత క్రమంగా ఆక్యుపెన్సీ పెరిగే రోజులొచ్చాయి. విక్రమ్, మేజర్ సినిమాల విషయంలో ఇదే జరిగింది. బింబిసారకు కూడా ఇలానే జరుగుతుందని యూనిట్ ఆశాభావంతో ఉంది.



First Published:  2 Aug 2022 10:31 AM GMT
Next Story