Telugu Global
Cinema & Entertainment

సీతారామంలో మాజీ స్టార్ హీరోయిన్

సీతారామం సినిమా నుంచి భూమిక ఫస్ట్ లుక్ రిలీజైంది. ఆమె తన స్మైల్ తో ఆకట్టుకుంటోంది.

Bhumika Chawla
X

సీతారామంలో చాలామంది స్టార్ కాస్ట్ ఉన్నారు. అయితే వాళ్లు ఎవరనేది మేకర్స్ ప్రకటించే వరకు బయటకు రావడం లేదు. మొన్నటికిమొన్న సుమంత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి షాకిచ్చారు. ఇప్పుడు భూమిక లుక్ విడుదల చేశారు. ఫస్ట్ లుక్ రిలీజయ్యేంతవరకు ఈ సినిమాలో భూమిక ఉందనే విషయం చాలామందికి తెలియదు.

యుద్ధ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న లవ్ స్టొరీ 'సీతారామం'. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను ఎంచుకున్నారు నిర్మాతలు. ప్రతి పాత్రను వినూత్నంగా పరిచయం చేస్తున్నారు.

అఫ్రీన్‌ పాత్రలో రష్మిక నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా పాత్రని మృణాళినిగా పరిచయం చేశారు. ఒక పాపని దగ్గరగా తీసుకొని బ్యూటీఫుల్ స్మైల్ తో ఫస్ట్ లుక్ లో ఆకట్టుకుంటోంది భూమిక. ఈ చిత్రంలో ఆమె బ్రిగేడియర్ విష్ణు శర్మకి భార్య పాత్రలో కనిపించనున్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

First Published:  21 July 2022 2:28 AM GMT
Next Story