Telugu Global
Cinema & Entertainment

Bhoothaddam Bhaskar Narayana - భూతద్దం భాస్కర్ నారాయణ ట్రయిలర్ విడుదల

Bhoothaddam Bhaskar Narayana - శివ కందుకూరి హీరోగా నటించిన భూతద్దం భాస్కర్ నారాయణ ట్రయిలర్ రిలీజైంది. ఎలా ఉందో చూద్దాం..

Bhoothaddam Bhaskar Narayana - భూతద్దం భాస్కర్ నారాయణ ట్రయిలర్ విడుదల
X

శివ కందుకూరి హీరోగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ 'భూతద్ధం భాస్కర్ నారాయణ'. ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టైటిల్ సాంగ్ వైరల్ అయ్యింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ రోజు విశ్వక్ సేన్ ఈ చిత్రం ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.

'ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు సమీపంలో మునుపెన్నడూ చూడని దారుణ హత్య జరిగింది. ఈ హత్యలని దిష్టి బొమ్మ హత్యలుగా పోలీసులు పేర్కొన్నారు''అనే న్యూస్ బులిటెన్ వాయిస్ మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ(శివ కందుకూరి) ఎలా పరిష్కరించాడనేది చాలా థ్రిల్లింగ్ గా ట్రైలర్ లో ప్రజెంట్ చేశారు. అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా? అని సస్పెన్స్ ని రేకెత్తిస్తూ ట్రైలర్ చివర్లో వచ్చిన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చాలా ఎక్సయిటింగ్ గా ఉన్నాయి. ట్రైలర్ సినిమాపై క్యురియాసిటీ పెంచింది.

భూతద్ధం భాస్కర్ నారాయణ అందరూ ఎంజాయ్ చేసే చిత్రం అంటున్నారు మేకర్స్. అందరి ఇంటిముందు ఒక దిష్టి బొమ్మ ఉంటుందని, ఆ దిష్టి బొమ్మ గురించే ఈ కథ అని... ట్రైలర్ లో రివీల్ చేయని ట్విస్ట్ లు సినిమాలో చాలా ఉన్నాయని చెబుతున్నారు.

First Published:  10 Feb 2024 11:44 AM GMT
Next Story