Telugu Global
Cinema & Entertainment

Bholaa Shankar | మరో 2 రోజుల్లో మెగా ట్రయిలర్

Bholaa Shankar | చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మెగా మాస్ ఎంటర్ టైనర్ కు ట్రయిలర్ రెడీ అయింది.

Bholaa Shankar | మరో 2 రోజుల్లో మెగా ట్రయిలర్
X

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ ఎంటర్‌టైనర్ భోళా శంకర్. మెహర్‌ రమేష్‌ దర్శకుడు. ఈ సినిమా ప్రమోషన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా రిలీజైన మిల్కీ బ్యూటీ సాంగ్ హిట్టయింది. ఈ క్రమంలో తాజాగా మరో బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.

భోళా శంకర్ థియేట్రికల్ ట్రైలర్‌ను మరో 2 రోజుల్లో, అంటే 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీజర్, పాటలతో మేకర్స్ కావాల్సినంత వినోదాన్ని అందించారు. ఇప్పుడు ట్రయిలర్ తో బిగ్ ఎంటర్ టైన్ మెంట్ రాబోతోంది. చిరంజీవి చేతిలో కత్తి పట్టుకుని కోపంగా నడుచుకుంటూ వస్తున్న పోస్టర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.

తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ఈ సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్న, చిరు చెల్లెలిగా కీర్తిసురేష్ నటిస్తున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చేనెల 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తారు.

వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సినిమా ఇదే. అందుకే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీనికితోడు తమిళ్ లో హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్ కావడంతో, అంచనాలు మరింత పెరిగాయి.

First Published:  25 July 2023 5:19 PM GMT
Next Story