Telugu Global
Cinema & Entertainment

Bholaa Shankar Teaser Review: భోళాశంకర్ టీజర్ వచ్చేసింది

Bholaa Shankar Movie Teaser Review: భోళాశంకర్ టీజర్ వచ్చేసింది. చిరంజీవి మరోసారి అదరగొట్టారు.

Bholaa Shankar Teaser Review: భోళాశంకర్ టీజర్ వచ్చేసింది
X

Bholaa Shankar Teaser Review: భోళాశంకర్ టీజర్ వచ్చేసింది

మనకి హద్దుల్లేవ్..సరిహద్దుల్లేవ్.. ఆల్ ఏరియాస్ మనవే. భోళాశంకర్ లో చిరంజీవి చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఇది. కొద్దిసేపటి కిందట భోళాశంకర్ టీజర్ రిలీజైంది. చిరంజీవి శ్వాగ్ కనిపించింది. 33 మందిని చంపాడనే డైలాగ్ తో, ఓ యాక్షన్ ఎపిసోడ్ తో టీజర్ ను గ్రాండ్ గా స్టార్ట్ చేశారు.

టీజర్ లో చిరంజీవి యాక్షన్ లుక్ అదిరింది. దీంతో పాటు చిరు కామెడీ టైమింగ్ ను, అద్భుతమైన డెైలాగ్ డెలివరీని కూడా టీజర్ లో చూడొచ్చు. ఈ సినిమాలో తెలంగాణ యాసలో చిరంజీవి డైలాగ్ చెప్పారు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది భోళాశంకర్ సినిమా. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో తమన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేశ్, కీలక పాత్రలో సుశాంత్ కనిపించనున్నారు. వీళ్లకు కూడా టీజర్ లో చోటు దక్కింది.

తమిళ్ లో సూపర్ హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్ గా వస్తోంది భోళాశంకర్. ఆగస్ట్ 11న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి వస్తున్నాడు భోళా. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.



First Published:  24 Jun 2023 1:42 PM GMT
Next Story