Telugu Global
Cinema & Entertainment

Bholaa Shankar - భోళాశంకర్ షూటింగ్ అప్ డేట్స్

Bholaa Shankar Movie Shooting Updates - ప్రస్తుతం స్విట్జర్లాండ్ లో చిరంజీవి-తమన్న కలిసి ఓ సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు.

Bholaa Shankar - భోళాశంకర్ షూటింగ్ అప్ డేట్స్
X

చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో వస్తున్న సినిమా “భోళా శంకర్”. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అనీల్ సుంకర నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ఓ పాట చిత్రీకరణ కోసం స్విట్జర్లాండ్ వెళ్లింది. చిరంజీవి, తమన్నాలపై ఓ సాంగ్ ని గ్రాండ్ గా చిత్రీకరించారు.

ఈ పాటకు సంబంధించిన విశేషాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా హ్యాండిల్ లో తెలియజేశారు. ''స్విట్జర్లాండ్ లో కళ్ళు చెదిరే అందాలతో మైమరిపించే లొకేషన్స్ లో భోళాశంకర్ కోసం తమన్నాతో ఆట పాట ఎంతో ఆహ్లాదంగా జరిగింది! ఈ పాట ప్రేక్షకులందరినీ, మరింతగా అభిమానులందరినీ మెప్పిస్తుందని చెప్పగలను. త్వరలోనే మరిన్ని సంగతులు పంచుకుందాం. అప్పటివరకూ ఈ 'చిరు లీక్స్' పిక్స్.''అంటూ లొకేషన్ స్టిల్స్ ని షేర్ చేశారు మెగాస్టార్.

మహతి స్వరసాగర్ ఈ పాటను కంపోజ్ చేశాడు. మరోవైపు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. క్రియేటివ్ కమర్షియల్స్‌ బ్యానర్ తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ గా కీర్తిసురేష్ నటిస్తోంది. హీరో సుశాంత్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

ఈ చిత్రానికి డడ్లీ డీవోపీ గా పని చేస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేయగా తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నారు. ‘భోళా శంకర్’ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

First Published:  24 May 2023 5:32 AM GMT
Next Story