Telugu Global
Cinema & Entertainment

Bholaa Shankar: భోళాశంకర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

Bholaa Shankar movie shooting updates : చిరంజీవి కొత్త సినిమా కి షిఫ్ట్ అయ్యారు. భోళా శంకర్ షూట్ స్టార్ట్ చేశారు.

Bholaa Shankar: భోళాశంకర్ కొత్త షెడ్యూల్ ప్రారంభం
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “భోళాశంకర్”. ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని భారీ కోల్‌కతా సెట్‌లో ఈ రోజు ప్రారంభమైంది.


వాల్తేరు వీరయ్యతో చిరంజీవి భారీ బ్లాక్ బస్టర్ సాధించడంతో భోళా శంకర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెహర్ రమేష్, చిరంజీవిని స్టైలిష్, ఇంకా మాస్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా నటిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది.


క్రియేటివ్ కమర్షియల్స్‌, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమా వస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.


సంక్రాంతి బరిలో వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన చిరంజీవి, భోళాశంకర్ ను కూడా ఇదే ఏడాది థియేటర్లలోకి రిలీజ్ చేయబోతున్నారు. అలా చిరంజీవి నుంచి ఈ ఏడాది 2 సినిమాలు వస్తున్నాయి.

First Published:  17 Jan 2023 4:36 PM GMT
Next Story