Telugu Global
Cinema & Entertainment

భోళాశంకర్ వచ్చే డేట్ తెలిసిపోయింది

చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళాశంకర్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారని అంతా అనుకున్నారు. కానీ కొత్త విడుదల తేదీ ప్రకటించారు.

భోళాశంకర్ వచ్చే డేట్ తెలిసిపోయింది
X

మెగాస్టార్ చిరంజీవి- స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ "'భోళా శంకర్". రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం విడుదల తేది ఖరారైంది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 14, 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

రిలీజ్ డే 'శుక్రవారం' అంబేద్కర్ జయంతి పబ్లిక్ హాలీడే. దాని తర్వాత వీకెండ్ సెలవులు వస్తాయి. అంటే బాక్సాఫీస్‌ వద్ద మూడు రోజుల పాటు మెగా ర్యాంపేజ్‌ ఖాయం. రేపు(ఆగస్టు22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'భోళా శంకర్' బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ ప్రకటన చేశారు.

పోస్టర్‌లో చిరంజీవి స్టైలిష్ గా నడుస్తూ ట్రైడెంట్ కీచైన్‌ ని తిప్పుతూ స్టయిల్ గా కనిపిస్తున్నారు. హీరోలని స్టైలిష్ గా ప్రజంట్ చేయడంలో పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ .. ట్రెండీ కాస్ట్యూమ్స్ , కళ్ళద్దాలతో మెగాస్టార్‌ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు మెగాస్టార్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు.

భోలా శంకర్ ఇప్పటివరకు 40శాతం పూర్తయింది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. కీర్తి సురేష్, చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, తమన్నా హీరోయిన్ గా కనిపించనుంది. మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడు.

First Published:  21 Aug 2022 11:26 AM GMT
Next Story