Telugu Global
Cinema & Entertainment

Bholaa Shankar - మరో 2 రోజుల్లో భోళా హంగామా

Bholaa Shankar songs- చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళాశంకర్. ఈ సినిమా ఫస్ట్ సాంగ్, 4వ తేదీన రిలీజ్ అవుతోంది.

Bholaa Shankar - మరో 2 రోజుల్లో భోళా హంగామా
X

వాల్తేరు వీరయ్య విజయంతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్‌’ చేస్తున్న సంగతి తెలిసిందే. భోళా మానియా జూన్ 4న విడుదలయ్యే మొదటి సింగిల్‌ తో ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి ఫస్ట్ సింగిల్ ప్రోమోను ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు.

ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. ఈ నెలాఖరకు సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో.. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ గా కనిపించనుంది. హీరో సుశాంత్ ఈ సినిమాలో లవర్ బాయ్ తరహా పాత్రలో కనిపించనున్నాడు.

పాటలతో భోళాశంకర్ పై అంచనాలు మరింత పెరగనున్నాయి. చిరంజీవి సినిమాకు తొలిసారి సంగీతం అందించే అవకాశం అందుకున్న స్వరసాగర్, మెగాస్టార్ కోస అద్భుతమైన సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాడట. సత్యానంద్ కథ పర్యవేక్షణ చేస్తున్న ఈ సినిమాకు తిరుపతి మామిడాల డైలాగ్స్ అందిస్తున్నాడు. భోళా శంకర్ ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

First Published:  2 Jun 2023 2:49 AM GMT
Next Story