Telugu Global
Cinema & Entertainment

Bhimaa | ఓటీటీలోకి గోపీచంద్ సినిమా

Bhimaa - గోపీచంద్ హీరోగా నటించిన సినిమా భీమా. థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమా ఓటీటీలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

Bhimaa | ఓటీటీలోకి గోపీచంద్ సినిమా
X

గోపీచంద్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా ఈ నెల 25వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. తాజాగా డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ఈ అనౌన్స్ మెంట్ చేసింది. మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు భీమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఇంట్రెస్ట్ గా ఉన్నారు.

ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు. దర్శకుడు ఎ హర్ష రూపొందించారు. అయితే ఇదొక ఫ్లాప్ సినిమా. మహాశివరాత్రి కానుకగా థియేటర్లలోకి వచ్చిన భీమా సినిమా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. పండగ సీజన్ ను క్యాష్ చేసుకోలేకపోయింది. విడుదలైన 3 రోజులకే దుకాణం సర్దేసింది.

అలా తక్కువ టైమ్ లోనే థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు 25వ తేదీకి డిస్నీ హాట్ స్టార్ లో రాబోతోంది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. భీమా చిత్రంలో ప్రియ భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కిన భీమా సినిమా గత నెల 8వ తేదీన థియేటర్స్ లోకి వచ్చింది.

ఈ సినిమాపై గోపీచంద్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. రామబాణం ఫ్లాప్ తర్వాత వచ్చిన ఈ మూవీ, కనీసం తనను రేసులో నిలబెడుతుందని ఆశపడ్డాడు. కానీ భీమా సినిమా నిలబడలేకపోయింది. రొటీన్ కథ, అందరూ ఊహించగలిగే సన్నివేశాలతో, 3-4 సినిమాల్ని కలిపి తీసినట్టు ప్రేక్షకులు భావించారు.

First Published:  13 April 2024 5:27 PM GMT
Next Story