Telugu Global
Cinema & Entertainment

Bhimaa | అఖండతో సంబంధం లేదంటున్న నిర్మాత

Bhimaa - భీమా ట్రయిలర్ లో అఖండ ఛాయలు కనిపించాయి. అయితే అఖండతో ఎలాంటి సంబంధం లేదంటున్నాడు నిర్మాత.

Bhimaa | అఖండతో సంబంధం లేదంటున్న నిర్మాత
X

గోపీచంద్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమా. ఈ సినిమాకి ఎ.హర్ష దర్శకుడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ లావిష్ గా నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటించారు. టీజర్ , ట్రైలర్, పాటలు ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత కె కె రాధామోహన్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు. మరీ ముఖ్యంగా అఖండతో తమ సినిమాకు ఎలాంటి పోలిక లేదని స్పష్టం చేశారు.

"అఖండ కి భీమాకి ఏ మాత్రం పోలిక లేదు. భీమాలో చూపించిన పరశురామక్షేత్రం బెంగళూరు, బాదామి పరిసరప్రాంతాల్లో ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. శివాలయం, అఘోరాలను యాంబియన్స్ కోసం చూపించాం. అఘోరాలకు కథతో సంబంధం లేదు. కథ, జోనర్ పరంగా ఇది చాలా డిఫరెంట్ మూవీ."

ఇలా అఖండతో తమ సినిమాకు సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేశారు నిర్మాత. మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను శివరాత్రి కానుకగా 8వ తేదీన విడుదల చేయబోతున్నారు.

First Published:  4 March 2024 4:55 PM GMT
Next Story