Telugu Global
Cinema & Entertainment

Bhairava Dweepam | భైరవద్వీపం 4K ట్రయిలర్ చూశారా?

Bhairava Dweepam - బాలకృష్ణ హీరోగా నటించిన క్లాసిక్ మూవీ భైరవద్వీపం. ఈ సినిమా రీ-రిలీజ్ కు రెడీ అయింది. కొత్త ట్రయిలర్ కూడా రిలీజైంది

Bhairava Dweepam | భైరవద్వీపం 4K ట్రయిలర్ చూశారా?
X

1974లో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ సినీ పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సినీ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి బాలకృష్ణ ఆల్ టైమ్ హిట్స్ లో ఒకటైన “భైరవద్వీపం” సినిమాను ఈ తరం ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.

1994లో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ ఎవర్‌గ్రీన్ ఫాంటసీ ఎంటర్‌టైనర్... క్లాప్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ ద్వారా గ్రాండ్‌గా రీ-రిలీజ్ అవుతోంది. అప్‌గ్రేడ్ చేసిన 4కె క్వాలిటీతో ఆగస్ట్ 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువస్తోంది.

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ, గోపీచంద్ మలినేని ఈ సినిమా ట్రయిలర్ ను ఆన్ లైన్ లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రయిలర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.

సినిమా కథ విషయానికొస్తే.. బాలకృష్ణ ఒక తెగలో పెరుగుతున్న రాకుమారుడు విజయ్‌ గా ధైర్య సాహసాలు కలిగిన వీరుడిగా కనిపిస్తాడు. విజయ్, కార్తికేయ రాజ్యానికి చెందిన యువరాణి ప్రేమలో పడతారు. ఒక దుష్ట మాంత్రికుడు, యువరాణిని బలి ఇవ్వడానికి 'భైరవద్వీపం' అనే ద్వీపానికి మాయాజాలం ద్వారా తీసుకువెళ్తాడు. విజయ్ చెడుతో పోరాడి, యువరాణిని ఎలా కాపాడతాడు అనేది 'భైరవద్వీపం' స్టోరీ.

ప్రముఖ రచయిత రావి కొండలరావు ఈ సినిమాకు కథ రాయగా.. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించడంతో పాటు.. స్వయంగా స్క్రీన్‌ ప్లే ని అందించారు. మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్.

First Published:  28 Aug 2023 5:29 PM GMT
Next Story