Telugu Global
Cinema & Entertainment

Bhagavanth Kesari | చాలా ఏళ్లు గుర్తుండిపోయే సినిమా

Bhagavanth Kesari - బాలయ్య హీరోగా నటించిన సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా చాన్నాళ్లు గుర్తుండిపోతుందంటున్నాడు దర్శకుడు.

Bhagavanth Kesari | చాలా ఏళ్లు గుర్తుండిపోయే సినిమా
X

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కింది ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషించింది. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న ఈ సినిమా చాన్నాళ్ల పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతుందంటున్నాడు దర్శకుడు రావిపూడి.

"నేను 6 సినిమాలు పూర్తి చేశాను. అంటే.. ఒక ఓవర్ అయిపోయింది. ఇది మరో ఓవర్, మరో ఇన్నింగ్స్ అనుకుంటున్నాను. ఎమోషనల్ డ్రామా సీన్స్ ముందు సినిమాల్లో కూడా బాగా చేశాను. అయితే ఎంటర్ టైన్ మెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అవి నెక్స్ట్ లెవల్ కి చేయలేదనే ఫీలింగ్ ఉంది. పూర్తిస్థాయిలో నిజాయితీగా ఓ ఎమోషనల్ డ్రామా చేయాలనిపించింది. దానికి బాలకృష్ణ రూపంలో నాకు సరైన ఆయుధం దొరికింది. మంచి స్టార్ కాస్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, కథ అన్నీ అద్భుతంగా కుదిరాయి. ‘భగవంత్ కేసరి' చాలా ఏళ్లు గుర్తుండిపోయే సినిమా అవుతుంది."

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేష్ బాబును ఒక ఆర్మీ కథలో చూపించాడు అనీల్ రావిపూడి. ఇప్పుడు ‘భగవంత్ కేసరి'లో ఓ అమ్మాయిని ఆర్మీకి పంపించే కథ ఎంచుకున్నాడు.

జీవితంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల అమ్మాయి ఎలా వీక్ అయ్యింది? ఆమెను తిరిగి ఎలా స్ట్రాంగ్ చేయాలి ? దాని బ్యాక్ డ్రాప్ ఏంటి అనే అంశాల కోసం ఆర్మీని నేపథ్యంగా తీసుకున్నాడు. 'అమ్మాయిని ఒక సింహంలా పెంచాలి' అనే సందేశాన్ని అంతర్లీనంగా ఇస్తున్నాడు.

First Published:  15 Oct 2023 11:25 AM GMT
Next Story