Telugu Global
Cinema & Entertainment

భగవంత్ కేసరి కేరాఫ్ నేలకొండ.. ఓన్లీ ఎమోషన్

Bhagavanth Kesari - బాలయ్య, అనీల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. ఎలా ఉందో చూద్దాం..

భగవంత్ కేసరి కేరాఫ్ నేలకొండ.. ఓన్లీ ఎమోషన్
X

బాబాయ్ గా బాలకృష్ణ, కూతురి పాత్రలో శ్రీలీల.. మరోవైపు దర్శకుడిగా అనీల్ రావిపూడి. ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్ లో వస్తున్న భగవంత్ కేసరి అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. సినిమాలో బాలయ్య ఎలా కనిపిస్తాడు.. అతడి హావభావాలేంటి లాంటి విషయాలపై ఇప్పటికే అందరికీ క్లారిటీ ఉంది. ఇప్పుడు సినిమా జానర్ పై, స్టోరీలైన్ పై, బాలయ్య క్యారెక్టరైజేషన్ పై పూర్తి క్లారిటీ వచ్చింది.

కొద్దిసేపటి కిందట భగవంత్ కేసరి ట్రయిలర్ రిలీజైంది. గతంలో అనీల్ రావిపూడి చెప్పినట్టుగానే ఈ ట్రయిలర్ లో దర్శకుడి టచ్ మిస్సవ్వలేదు. సేమ్ టైమ్ బాలయ్య నుంచి అభిమానులు కోరుకునే హై కూడా ఉంది. ఇలా చిన్న కామెడీ, హై-యాక్షన్ రెండూ మిక్స్ అయ్యేలా ట్రయిలర్ కట్ చేసిన విధానం బాగుంది.

సినిమాలో శ్రీలీల పాత్ర కీలకమనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. శ్రీలీలను స్ట్రాంగ్ గా చేయాలనుకుంటాడు బాలయ్య. ఆయన అలా ఎందుకు డిసైడ్ అయ్యాడు. శ్రీలీల అసలు ఎవరు? విలన్ కు బాలయ్యకు మధ్య ఏం జరిగింది అనే సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ట్రయిలర్ కట్ చేశారు.

చివర్లో తనపై తానే బాలయ్య సెటైర్ వేసుకోవడం బాగుంది. బాలయ్య పాటలపై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్స్ గురించి అందరికీ తెలిసిందే. ట్రయిలర్ చివర్లో బాలయ్య ఓ పాట పాడతాడు. ఎట్లున్నా పాడతా అంటూ చెప్పడం కొసమెరుపు. ట్రయిలర్ లో బాలయ్య తెలంగాణ యాస బాగుంది. విలన్ గా అర్జున్ రాంపాల్ బాగా సెట్ అయ్యాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. దసరాకు పెర్ ఫెక్ట్ గా ల్యాండ్ అవ్వడానికి రెడీ అయింది భగవంత్ కేసరి.

First Published:  8 Oct 2023 3:39 PM GMT
Next Story