Telugu Global
Cinema & Entertainment

Bhagavanth Kesari | హిందీలో రాబోతున్న బాలయ్య మూవీ

Bhagavanth Kesari - తెలుగులో సూపర్ హిట్టయిన భగవంత్ కేసరి సినిమా, ఇప్పుడు హిందీ ప్రేక్షకుల్ని కూడా అలరించబోతోంది. త్వరలోనే హిందీలో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.

Bhagavanth Kesari | హిందీలో రాబోతున్న బాలయ్య మూవీ
X

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి' చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ కా షేర్ గా నిలిచింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా శ్రీలీల కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, అభిమానులు, ప్రేక్షకులు, విమర్శకులందరి ప్రశంసలు అందుకొని అఖండ విజయం సాధించింది.

ఇప్పుడీ సినిమా హిందీ ప్రేక్షకులను కూడా అలరించబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా బాలకృష్ణ బయటపెట్టారు. భగవంత్ కేసరి సినిమాను అదే పేరుతో హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేయబోతున్నారు. హిందీ వెర్షన్ కు స్వయంగా బాలకృష్ణ డబ్బింగ్ చెప్పడం విశేషం.

తెలుగులో హిట్టయినట్టుగానే హిందీలో కూడా సినిమా పెద్ద హిట్టవుతుందని అంటున్నారు బాలయ్య. ‘భగవంత్ కేసరి' రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఈ వేడుకల్లో ముఖ్యఅతిధిగా పాల్గొని చిత్ర బృందానికి షీల్డ్స్ అందించారు.

ఈ వేదికపైనే హిందీ రిలీజ్ పై ప్రకటన చేశారు బాలయ్య. దేవుడి దయవల్ల వరుస విజయాలతో దూసుకుపోతున్న తను, బాలీవుడ్ లో కూడా రాణిస్తానని తెలిపారు. త్వరలోనే భగవంత్ కేసరి హిందీ విడుదల తేదీని ప్రకటిస్తారు.

First Published:  11 Nov 2023 1:39 PM GMT
Next Story