Telugu Global
Cinema & Entertainment

Bhagavanth Kesari | రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన బాలయ్య

Bhagavanth Kesari - బాలకృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు.

Bhagavanth Kesari | రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన బాలయ్య
X

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి’. దసరా శెలవుల్లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది ఈ మూవీ. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్లుగా ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం సినిమా రిలీజ్ అవుతోంది. పైగా దసరా శెలవులు. దీంతో లాంగ్ వీకెండ్ తో పాటు, హాలిడేస్ ఈ సినిమాకు బిగ్ అడ్వాంటేజ్ గా మారనున్నాయి.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో రెండు చేతుల్లో రెండు గన్స్ పట్టుకొని, కోపంగా నడుస్తూ వస్తున్న బాలకృష్ణను చూపించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో భారీ యాక్షన్‌ సీన్స్ ఉన్నాయి. అనిల్ రావిపూడి మార్క్ వినోదంతో పాటు, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి.

షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. భగవంత్ కేసరిలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలకృష్ణకు కూతురు వరస పాత్రలో శ్రీలీల కనిపించనుంది.

ఇక ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు. ఇందులో అతడు విలన్ గా కనిపించనున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  23 July 2023 7:34 AM GMT
Next Story