Telugu Global
Cinema & Entertainment

Bhaag Saale - మరో ఇంట్రెస్టింగ్ మూవీ లోడింగ్

Bhaag Saale Trailer - శ్రీసింహా హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ భాగ్ సాలే. ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది

Bhaag Saale - మరో ఇంట్రెస్టింగ్ మూవీ లోడింగ్
X

సస్పెన్స్, యాక్షన్ కు మంచి కామెడీ తోడైతే ఆ కిక్కే వేరు. ఇంతకుముందు చాలా సినిమాలు ఈ జానర్ లో వచ్చి సూపర్ హిట్టయ్యాయి. స్వామి రారా, రాజ రాజ చోర లాంటి సినిమాలు ఈ కోవలోకే వస్తాయి. ఇప్పుడిదే కాన్సెప్ట్ తో వస్తోంది భాగ్ సాలే సినిమా. శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ తాజాగా రిలీజైంది.

ఈ చిత్రంలో హీరో పాత్ర పేరు అర్జున్. అతనో టక్కరి దొంగ. తను చేయాలనుకున్నవి చేసేసినట్లు కటింగ్ ఇస్తుంటాడు. తన పని అయ్యేలా చూసుకుంటాడు. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

సినిమా స్టోరీ ఏంటనే విషయాన్ని ట్రయిలర్ లో క్లియర్ గా చెప్పేశారు. ఓ ఉంగరం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. దాని చుట్టూ ఫన్ జనరేట్ అవుతుంది. ట్రయిలర్ చూస్తుంటే, సినిమాలో మంచి కామెడీ ఉన్నట్టు కనిపిస్తోంది.

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో, నేహా సోలంకి హీరోయిన్. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే విడుదలకు సిద్ధమవుతోంది.



First Published:  26 Jun 2023 12:50 PM GMT
Next Story