Telugu Global
Cinema & Entertainment

Bellamkonda - ఎట్టకేలకు మళ్లీ తెలుగులోకి..!

Bellamkonda - సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. సాగర్ చంద్ర దర్శకుడు.

Bellamkonda - ఎట్టకేలకు మళ్లీ తెలుగులోకి..!
X

2021లో వచ్చిన అల్లుడు అదుర్స్ సినిమా తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. తన హిందీ డెబ్యూ కోసం ఏకంగా రెండేళ్లు కేటాయించాడు. అలా వీవీ వినాయక్ దర్శకత్వంలో ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేశాడు. దాని కోసం చాలా కష్టపడ్డాడు, ఎంతో కష్టపడి ప్రచారం కూడా చేశాడు. కానీ ఫలితం మాత్రం శూన్యం.

హిందీ ఛత్రపతి, నార్త్ బెల్ట్ లో డిజాస్టర్ అయింది. దీంతో సాయిశ్రీనివాస్ నిరాశచెందాడు. అయితే వెంటనే కోలుకొని, తిరిగి టాలీవుడ్ కు వచ్చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో తన కొత్త సినిమా స్టార్ట్ చేశాడు ఈ హీరో.

పవన్ కళ్యాణ్‌ తో 'భీమ్లా నాయక్‌' లాంటి హిట్ సినిమా తీసిన సాగర్ చంద్రతో చేతులు కలిపాడు బెల్లంకొండ. వీళ్లిద్దరి కాంబోలో సినిమా తాజాగా లాంచ్ అయింది. దర్శకులు హరీష్ శంకర్, పరశురామ్, అనీల్ రావిపూడి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

బెల్లంకొండ కెరీర్ లో పదో సినిమా ఇది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు.

ఇకపై తన పూర్తి టైమ్ టాలీవుడ్ కు కేటాయిస్తానని ప్రకటించాడు బెల్లంకొండ. నార్త్ లో తనకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని హిందీ సినిమా చేశానని, ఇప్పుడు తన తెలుగు సినిమాలతో హిందీ ఆడియన్స్ కు దగ్గరవుతానని అంటున్నాడు. తాజా చిత్రం వచ్చే వారం నుంచి సెట్స్ పైకి వస్తుంది.

First Published:  2 Jun 2023 2:29 AM GMT
Next Story