Telugu Global
Cinema & Entertainment

Tyson Naidu | బెల్లంకొండ సినిమా షూటింగ్ అప్ డేట్స్

Tyson Naidu - బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తాజా చిత్రం టైసన్ నాయుడు. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం

Tyson Naidu | బెల్లంకొండ సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌ టైసన్ నాయుడు. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రివిల్ చేసిన ఈ సినిమా టైటిల్ 'టైసన్ నాయుడు' గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈరోజు, మేకర్స్ రాజస్థాన్‌లో సినిమాకు కీలకమైన 2 వారాల షెడ్యూల్‌ను ప్రారంభించారు. స్టన్ శివ పర్యవేక్షణలో రాజస్థాన్ కోటలలో 10 రాత్రులు సినిమాకు సంబంధించిన యాక్షన్ బ్లాక్‌ను టీమ్ షూట్ చేస్తోంది. ఇది సినిమాలో మెయిన్ హైలైట్‌లలో ఒకటి.

ఈ 2 వారాల లెన్తీ షెడ్యూల్‌లో మేకర్స్ కొంత టాకీ పార్ట్ కూడా షూట్ చేయనున్నారు. ఈ సబ్జెక్ట్‌పై టీమ్ సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉండటంతో రాజీపడకుండా సినిమాను రూపొందిస్తున్నారు. గ్లింప్స్‌లో చూపిన విధంగా, బెల్లంకొండ సినిమాలో మాస్ లుక్‌లో ఉన్నారు. పోలీస్ గా మునుపెన్నడూ చూడని యాక్షన్ ప్యాక్ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేస్తున్నారు సాగర్ కె చంద్ర.

టాప్ టెక్నీషియన్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు.

First Published:  24 May 2024 5:43 PM GMT
Next Story