Telugu Global
Cinema & Entertainment

Chatrapathi First Look - ఇది బెల్లంకొండ ఛత్రపతి

Chatrapathi Movie - బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న స్ట్రయిట్ హిందీ సినిమా ఛత్రపతి. ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ అయింది.

Chatrapathi First Look - ఇది బెల్లంకొండ ఛత్రపతి
X

తెలుగు హీరో శ్రీనివాస్ బెల్లంకొండ బాలీవుడ్‌ లో లాంచ్ అవుతున్నాడు. పెన్ స్టుడియోస్ బ్యానర్ పై ఛత్రపతి సినిమాను రీమేక్ చేస్తున్నాడు. వీవీ వినాయక్ ఈ సినిమాకు దర్శకుడు.

ఇప్పటికే ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈరోజు ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేసిన మేకర్స్, రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి ‘ఛత్రపతి’ అని పేరు పెట్టారు. సమ్మర్ స్పెషల్ గా మే 12న సినిమా థియేటర్లలోకి రానుంది.

ఫస్ట్-లుక్ పోస్టర్‌ లో షర్ట్ లేకుండా బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్నాడు బెల్లంకొండ. కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు. ఒక చేతిలో రాగి చెంబుతో నీటిలో నిలబడి, వీపుపై గాయాలతో కనిపించారు. ఛత్రపతి సినిమా చూసినవాళ్లకు ఎవరికైనా, ఈ సీన్ ఎక్కడిదో ఈజీగా తెలిసిపోతుంది.

డాక్టర్ జయంతిలాల్ గడా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాడు. ఒరిజినల్‌కి కథను అందించిన రాజమౌళి తండ్రి కెవి విజయేంద్ర ప్రసాద్‌ రీమేక్ వెర్షన్‌కి కూడా రచయిత. పలు తెలుగు తమిళ చిత్రాలకు పనిచేసిన నిజార్ అలీ షఫీ కెమెరా మెన్ గా, బాలీవుడ్ అప్ కమింగ్ కంపోజర్ తనిష్క్ బాగ్చి సంగీతం అందించారు. ఈ సినిమాతో బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు బెల్లంకొండ.

First Published:  27 March 2023 2:50 PM GMT
Next Story