Telugu Global
Cinema & Entertainment

Bellamkonda Sai Srinivas | ఎట్టకేలకు సినిమా రెడీ చేస్తున్న బెల్లంకొండ

Bellamkonda Sai Srinivas - ఛత్రపతి హిందీ రీమేక్ కోసం లాంగ్ గ్యాప్ తీసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్, ఎట్టకేలకు తెలుగులో మరో సినిమా రెడీ చేశాడు.

Bellamkonda Sai Srinivas | ఎట్టకేలకు సినిమా రెడీ చేస్తున్న బెల్లంకొండ
X

హీరో శ్రీనివాస్ బెల్లంకొండ, డైరెక్టర్ సాగర్ చంద్ర కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో బెల్లంకొండ రీఎంట్రీ ఇస్తున్నాడు. కెరీర్ లో బెల్లంకొండకు ఇది పదో సినిమా.

రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా ఇన్నాళ్లూ సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంది. ఇప్పటికే కీలకమైన షూటింగ్ షెడ్యూల్స్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు.

ఈ సినిమా నుంచి ఇప్పుడో కీలకమైన అప్ డేట్ వచ్చింది. జనవరి 3వ తేదీన శ్రీనివాస్ బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు, బెల్లంకొండ ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు.

బెల్లంకొండను పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో ప్రెజెంట్ చేయడానికి సాగర్ కె చంద్ర పవర్ ఫుల్ స్క్రిప్ట్ రాసుకున్నారు. ఈ చిత్రంలో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

First Published:  31 Dec 2023 5:05 PM GMT
Next Story