Telugu Global
Cinema & Entertainment

బెల్లంకొండ అస్సలు తగ్గట్లేదుగా..!

బెల్లంకొండ గణేశ్ హీరోగా పరిచయమౌతున్న సినిమా స్వాతిముత్యం. ఈ సినిమాను అక్టోబర్ 5న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఓవైపు చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా రేసులో ఉన్నప్పటికీ, స్వాతిముత్యం తగ్గట్లేదు..

బెల్లంకొండ అస్సలు తగ్గట్లేదుగా..!
X

ఎప్పుడైతే గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ ప్రకటించారో, అప్పుడిక చిన్న సినిమాలన్నీ దసరా బరి నుంచి తప్పుకుంటాయని అంతా అనుకున్నారు. అదే టైమ్ లో నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాను కూడా షెడ్యూల్ చేసిపెట్టారు. దీంతో నాగ్ వెర్సెస్ చిరు అనుకున్నారంతా. ఇలాంటి పోటీలో చిన్న సినిమాలు ఎంటరైతే నలిగిపోవడం ఖాయమంటూ విశ్లేషణలు కూడా వచ్చాయి. అయితే ఇవేం పట్టించుకోవడం లేదు బెల్లంకొండ గణేశ్.

అవును.. బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా స్వాతిముత్యం. ఈ సినిమాను అక్టోబర్ 5న విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు చిరంజీవి గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ వచ్చింది. ఆ తర్వాత వారానికి ఘోస్ట్ రిలీజ్ డేట్ కూడా వచ్చింది. అన్నీ అక్టోబర్ 5 రిలీజులే. దీంతో స్వాతిముత్యం సినిమా తప్పుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు.

ఈరోజు స్వాతిముత్యం సినిమా నుంచి ఓ లిరికల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో అక్టోబర్ 5 రిలీజ్ అంటూ మరోసారి ప్రకటించి చిన్నపాటి షాక్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా నుంచి నెక్ట్స్ వచ్చే ఏ ప్రమోషన్ వీడియో లేదా పోస్టర్ లోనైనా కొత్త రిలీజ్ డేట్ ఉంటుందని అంతా ఆశించారు. కానీ మేకర్స్ మాత్రం దసరా రిలీజ్ వదులుకోవడం లేదు.

పూర్తిగా ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది స్వాతిముత్యం సినిమా. దసరా సీజన్ ఈ సినిమాకు పెర్ ఫెక్ట్ అని భావిస్తున్నారు. పైగా గాడ్ ఫాదర్, ఘోస్ట్ జానర్లతో ఈ సినిమాకు సమస్య లేదు. అందుకే సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మాతలు తగ్గడం లేదు. ఇంకా నెల రోజులు టైమ్ ఉంది కాబట్టి, ఈలోగా ఏం జరుగుతుందో చూడాలి.

First Published:  7 Sep 2022 12:30 PM GMT
Next Story