Telugu Global
Cinema & Entertainment

Nenu Student Sir: 'నేను స్టూడెంట్ సర్' టీజర్ రిలీజ్

బెల్లంకొండ గణేష్ రెండో సినిమా రెడీ అయింది. ఈరోజు టీజర్ కూడా రిలీజైంది. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటి?

Nenu Student Sir: నేను స్టూడెంట్ సర్ టీజర్ రిలీజ్
X

'స్వాతిముత్యం 'తో ప్రశంసలు అందుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్, ఇప్పుడు తన రెండో సినిమాతో రెడీ అయ్యాడు. ఆ సినిమా పేరు 'నేను స్టూడెంట్ సర్'. తాజాగా ఈ సినిమాకు సంబందించి టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే గణేష్ మొదటి చిత్రానికి ఇది పూర్తి భిన్నంగా ఉంది. దర్శకుడు వివి వినాయక్ టీజర్‌ను విడుదల చేశారు.

ఐఫోన్ కొత్త సిరీస్ లాంచ్ ప్రకటనతో టీజర్ ప్రారంభమవుతుంది. ప్రతి యువకుడిలాగే, గణేష్ కూడా ఫోన్ కొనడానికి ఆసక్తిగా ఉంటాడు. అతను చివరకు ఫోన్ కొనగానే, దాన్ని ఎవరో దొంగిలిస్తారు. ఆ తర్వాత ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు చేరుకుంటాడు. అతను పోలీసు అధికారులను దొంగలు అని అనడం ఆశ్చర్యం కలిగించే విషయంగా టీజర్ లో చూపించారు.

ఈ సినిమాకు కృష్ణ చైతన్య ఒక విలక్షణమైన కథను అందించాడనే విషయం టీజర్ చూస్తే తెలుస్తోంది. దర్శకుడు రాఖీ ఉప్పలపాటి తన టేకింగ్‌ తో ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో సినిమాపై బజ్ క్రియేట్ చేశాడు. యాక్షన్-ప్యాక్డ్ టీజర్‌లో ప్రధాన నటి అవంతిక దాసాని, కీలక పాత్రలు పోషించిన సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్‌ తో సహా ప్రముఖ నటీనటులందరినీ చూపించారు.

ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై సతీష్ వర్మ ఈ సినిమాను నిర్మించారు. ఇంతకుముందు ఇతడు నిర్మించిన నాంది సినిమా టైపులోనే ఇది కూడా కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. మహతి స్వర సాగర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అనిత్ మదాడి సినిమాటోగ్రఫీ టీజర్ లో హైలైట్‌ గా నిలిచాయి. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు.



First Published:  12 Nov 2022 12:00 PM GMT
Next Story