Telugu Global
Cinema & Entertainment

సల్మాన్ ఖాన్ సిన్మాలో బతుకమ్మ పాట.. వీడియో ఇదిగో చూడండి

ఒక హిందీ సినిమాలో తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పాటను పెట్టడం ఇదే తొలిసారి.

సల్మాన్ ఖాన్ సిన్మాలో బతుకమ్మ పాట.. వీడియో ఇదిగో చూడండి
X

బాలీవుడ్ సినిమాలకు ఒకప్పుడు దక్షిణాది అంటే తమిళనాడు, కేరళ మాత్రమే. వారి సినిమాల్లోని కథల్లో ఎవరినైనా దక్షిణాది వారిని చూపెట్టాలంటే మద్రాసీలుగా చూపెట్టేవాళ్లు. ఇక తెలుగు సినిమాల్లో ఎక్కువగా హైదరాబాద్ లేదంటే కోనసీమ ప్రాంతాలు మాత్రమే కనపడతాయి. కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడి యాస, భాష, సంస్కృతులను సినిమాల్లో చూపెట్టడం ఎక్కువయ్యింది. కేవలం తెలంగాణ ప్రాంతాల్లో తీసిన సినిమాలు కూడా భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ఇటీవల బలగం, నిన్న విడుదలైన దసరా సినిమాలు పూర్తిగా తెలంగాణ ప్రాంతంలో తీసినవే. ఇక ఇప్పుడు తెలంగాణ సంస్కృతి బాలీవుడ్‌కు కూడా పాకింది.

సల్మాన్ ఖాన్ హీరోగా 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్' అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. తమిళంలో హిట్ అయిన 'వీరమ్' సినిమాకు రీమేక్‌గా ఇది వస్తోంది. పవన్ కల్యాణ్ ఇదే వీరమ్‌ను తెలుగులో 'కాటమరాయుడు'గా రీమేక్ చేశాడు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ పూజా హేగ్డేను తెలంగాణ ప్రాంత వాసిగా చూపెట్టారు. ఆమె అన్నగా విక్టరీ వెంకటేశ్ నటించారు. ఈ సినిమాలో 'బతుకమ్మ' పాటను పెట్టారు. ఒక హిందీ సినిమాలో తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మ పాటను పెట్టడం ఇదే తొలిసారి. దీనికి సంబంధించిన వీడియోను సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు.

కాగా, ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. యూట్యూబ్‌ వీక్షణలో దూసుకొని పోతోంది. రవి బసూర్ కంపోజ్ చేయగా తెలుగులో ఈ పాట లిరిక్స్ కిన్నాల్ రాజ్, హరిని ఇవటూరి రాశారు. ఇక దీనిలో వచ్చే బతుకమ్మ లైన్లను చుంచి నాగవ్వ పాడింది. మీరు కూడా ఈ పాట వినాలంటే కింద లింక్ క్లిక్ చేయండి.

First Published:  31 March 2023 10:05 AM GMT
Next Story