Telugu Global
Cinema & Entertainment

Goodachari 2 | సెట్స్ పైకొచ్చిన హీరోయిన్

Goodachari 2 - అడివి శేష్ హీరోగా నటిస్తున్న సినిమా గూఢచారి 2. ఈ సినిమా సెట్స్ లో తాజాగా హీరోయిన్ బనితా సందు జాయిన్ అయింది.

Goodachari 2 | సెట్స్ పైకొచ్చిన హీరోయిన్
X

గూఢచారి సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 (జీ2) చేస్తున్నాడు అడివి శేష్. ఈ సినిమాలో అతడి సరసన హీరోయిన్ గా బనితా సంధును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. యాక్షన్ మూవీగా వస్తున్న ఈ సినిమా బనితాకు తొలి పాన్ ఇండియా మూవీ కానుంది. ఇంతకుముందు అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ సినిమాల్లో నటించింది బనిత.

గుజరాత్‌లోని భుజ్‌ లో జరుగుతున్న 'G2' షూటింగ్ లో బనితా సంధు జాయిన్ అయింది. ఈ షెడ్యూల్‌ లో అడివి శేష్, బనిత పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. అడివి శేష్‌, బనితా సంధు తెరపై సరిగ్గా సరిపోతారని చెబుతోంది యూనిట్.

జి2లో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. 2018లో వచ్చిన గూఢచారి చిత్రానికి హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెల్ గా ఆరేళ్ల తర్వాత మళ్లీ తెరపైకి వస్తోంది ఈ సినిమా.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  31 March 2024 6:53 AM GMT
Next Story