Telugu Global
Cinema & Entertainment

ఈ శుక్రవారమే బాలయ్య సినిమా టైటిల్ రిలీజ్

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా టైటిల్ పై సోషల్ మీడియాలో చాలా పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. అసలు టైటిల్ ఏంటనేది శుక్రవారం తేలిపోతుంది.

ఈ శుక్రవారమే బాలయ్య సినిమా టైటిల్ రిలీజ్
X

బాలకృష్ణ , గోపీచంద్ మలినేని క్రేజీ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఫస్ట్‌లుక్‌, టీజర్‌కి వచ్చిన ట్రెమండస్ రెస్పాన్స్‌ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.

ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. బాలయ్య సినిమా టైటిల్‌ ని ఈ శుక్రవారమే, అక్టోబర్ 21న విడుదల చేయనున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే కొన్ని టైటిల్స్ హల్‌చల్ చేస్తున్నాయి. వీటిలో ఏ టైటిల్ ఖరారు అయిందో శుక్రవారం తేలిపోతుంది.

శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలకృష్ణ ,గోపీచంద్ మలినేని చిత్రాలకు బ్లాక్ బస్టర్ ఆల్బమ్‌లను అందించిన తమన్, ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

First Published:  17 Oct 2022 3:19 AM GMT
Next Story