Telugu Global
Cinema & Entertainment

Balakrishna: వీరసింహారెడ్డి షూటింగ్ అప్ డేట్స్

VeeraSimhaReddy: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి అనే సినిమా చేస్తున్నాడు బాలయ్య. రేపట్నుంచి ఈ సినిమా చివరి సాంగ్ షూటింగ్ మొదలవుతుంది.

Balakrishna: వీరసింహారెడ్డి షూటింగ్ అప్ డేట్స్
X

వీరసింహారెడ్డి

వీరసింహారెడ్డి.. బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఇప్పుడీ సినిమా కొలిక్కి వచ్చింది. ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఆ ఒక్క పాటను శుక్రవారం నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఆ సాంగ్ షూటింగ్ పూర్తిచేయబోతున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తోంది వీరసింహారెడ్డి. శృతిహాసన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. చివరి పాటను బాలయ్య, శృతిహాసన్ పైనే చిత్రీకరించబోతున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

సంక్రాంతికి కానుకగా థియేటర్లలోకి వచ్చేందుకు శరవేగంగా సిద్ధమౌతోంది వీరసింహారెడ్డి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం, సినిమాలో చిన్నపెద్ద కలిపి మొత్తంగా 11 ఫైట్లు ఉన్నాయంట.

పక్కా యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది వీరసింహారెడ్డి. వరలక్ష్మి శరత్ కుమార్. దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.

First Published:  17 Nov 2022 6:30 AM GMT
Next Story