Telugu Global
Cinema & Entertainment

Veera Simha Reddy: బాలయ్య సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా?

Veera Simha Reddy: బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా పరిస్థితేంటి? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిందా?

Veera Simha Reddy Movie Review: ‘వీరసింహారెడ్డి’ – రివ్యూ {2.5/5}
X

Veera Simha Reddy Movie Review: ‘వీరసింహారెడ్డి’ – రివ్యూ {2.5/5}

బాక్సాఫీస్ బరిలో వీరసింహారెడ్డి అపసోపాలు పడుతున్నాడు. మొదటి రోజు కళ్లుచెదిరే ఓపెనింగ్స్ అందుకున్న ఈ సినిమా సూపర్ హిట్టయిందని అంతా అనుకున్నారు. కానీ రెండో రోజుకే ఈ సినిమా పడిపోయింది. సంక్రాంతి సీజన్ కాబట్టి, 3 రోజులు బాగానే నిలబడిన వీరసింహారెడ్డి, ముక్కనుమ రోజు నుంచే చతికిలపడ్డాడు.

ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 2 కోట్ల రూపాయల వసూళ్లు రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఈ టాక్ తో 2 కోట్ల రూపాయల వసూళ్లు అంటే కష్టమనే చెప్పాలి.

అయితే సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవ్వడంతో ఈమాత్రమైనా రికవరీ సాధించగలిగింది వీరసింహారెడ్డి సినిమా. ఈ విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ప్లాన్ బ్రహ్మాండంగా వర్కవుట్ అయిందనే చెప్పాలి. ఈ సీజన్ కాకుండా, సాధారణ రోజుల్లో వీరసింహారెడ్డి రిలీజ్ అయితే అట్టర్ ఫ్లాప్ అయి ఉండేదనేది విశ్లేషకుల మాట.

ఓవైపు సినిమా పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు ఈరోజు వీరసింహారెడ్డి విజయోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకుడు. శృతిహాసన్ హీరోయిన్. తమన్ సంగీతం అందించాడు.

First Published:  22 Jan 2023 8:34 AM GMT
Next Story