Telugu Global
Cinema & Entertainment

Veera Simha Reddy: బాలయ్య సినిమా షూటింగ్ పూర్తి

Veera Simha Reddy: వీరసింహారెడ్డి సినిమా కొలిక్కి వచ్చింది. రామోజీ ఫిలింసిటీలో చేసిన షెడ్యూల్ తో ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది.

Veera Simha Reddy: బాలయ్య సినిమా షూటింగ్ పూర్తి
X

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేనిల భారీ చిత్రం 'వీరసింహారెడ్డి' జనవరి 12న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం ప్రచారాన్ని కూడా దూకుడుగా మొదలుపెట్టారు.

ఇప్పటికే ప్రతి ప్రమోషన్ మెటీరియల్‌ కు భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. తమన్ సంగీతం అందించిన 'జై బాలయ్య' ఫస్ట్ సింగిల్ కూడా చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది.

ఓ వైపు ప్రమోషన్లు ఇలా సాగుతుండగా, మరోవైపు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. టాకీ పార్ట్ మొత్తం పూర్తి కాగా, ఒక్క పాట మాత్రమే షూటింగ్‌ కి మిగిలి ఉంది. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కింది ఈ సినిమా.

First Published:  7 Dec 2022 1:06 PM GMT
Next Story