Telugu Global
Cinema & Entertainment

Balakrishna: వీరసింహం నుంచి రెండో సింగిల్ వస్తోంది

Veera Simha Reddy: బాలయ్య హీరోగా నటిస్తున్న సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ రెడీ అయింది. ఇది ఒక డ్యూయెట్.

Balakrishna: వీరసింహం నుంచి రెండో సింగిల్ వస్తోంది
X

నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి'. గతంలో ఎన్నడూ లేని విధంగా మాస్ ట్రీట్ అందించబోతోంది ఈ మూవీ. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోషన్ మెటీరియల్ అంచనాలను పెంచుతోంది.

'వీరసింహారెడ్డి' సెకండ్ సింగిల్ సుగుణ సుందరిని డిసెంబర్ 15న విడుదల చేస్తామని మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఇప్పుడు పాటను లాంచ్ చేయడానికి టైం ని లాక్ చేశారు. సుగుణ సుందరి సాంగ్ రేపు ఉదయం 9:42 గంటలకు విడుదల కానుంది. ఓ లవ్లీ పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ ప్రకటన చేశారు. పోస్టర్‌లో బాలకృష్ణ యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపించగా శృతి హాసన్ మల్టీ-కలర్ డ్రెస్‌లో ఆకట్టుకుంది.

ఈ డ్యూయట్ లో లీడ్ పెయిర్ అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ తో అలరించబోతుతున్నారు. తమన్ ఈ చిత్రం కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించాడు. ఫస్ట్ సింగిల్ జై బాలయ్యకు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. జై బాలయ్య సాంగ్ మాస్ నంబర్ అయితే, సుగణ సుందరి అనేది డ్యూయట్.

ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా థియేటర్లలోకి వస్తోంది.




First Published:  14 Dec 2022 5:30 AM GMT
Next Story