Telugu Global
Cinema & Entertainment

Bhagavanth Kesari - బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ ఇదే

Balakrishna's Bhagavanth Kesari: అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ చేశారు.

Balakrishna Remuneration | పారితోషికం పెంచిన బాలయ్య
X

Balakrishna Remuneration | పారితోషికం పెంచిన బాలయ్య

నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ లో బాలయ్యకు ఇది 108వ చిత్రం. షైన్ స్క్రీన్స్‌ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈరోజు ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. 'భగవంత్ కేసరి' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఇది ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్ర పేరు. యూనిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'ఐ డోంట్ కేర్' అనే క్యాప్షన్ పెట్టారు.

టైటిల్ లోగో భారతదేశ చిహ్నం (అశోక సింహ రాజధాని)తో బాగా డిజైన్ చేశారు. బాలకృష్ణ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌ లో డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్ లో కనిపించారు. మోకాళ్లపై కూర్చున్న బాలకృష్ణ ఆవేశంతో ఒక ఆయుధాన్ని నేలపై కొట్టే షాట్ ను పోస్టర్ గా విడుదల చేశారు. బ్యాగ్రౌండ్, బాలకృష్ణ ఎక్స్ ప్రెషన్ చూస్తే ఈ సినిమా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ అని అర్థమౌతోంది.

అనిల్ రావిపూడి ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని గెటప్, క్యారెక్టర్‌ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. టైటిల్ లాగే పోస్టర్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. టైటిల్ పోస్టర్‌ను ప్రత్యేకమైన పద్ధతిలో లాంచ్ చేశారు. టైటిల్ పోస్టర్లను 108 లొకేషన్లలో 108 హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. అంతే కాదు.. బాలకృష్ణ పుట్టినరోజు కోసం మరిన్ని సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశారు.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా థియేటర్లలోకి వస్తోంది భగవంత్ కేసరి.

First Published:  8 Jun 2023 12:00 PM GMT
Next Story