Telugu Global
Cinema & Entertainment

Balakrishna: బాలయ్య కోసం ముగ్గురు హీరోయిన్లు

Balakrishna: తన కొత్త షో కోసం ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో చిట్ చాట్ పెట్టబోతున్నారు బాలకృష్ణ. గమ్మత్తైన విషయం ఏంటంటే.. ఈ ముగ్గురిలో ఎవరూ బాలయ్య సరసన హీరోయిన్ గా నటించలేదు.

Balakrishna: బాలయ్య కోసం ముగ్గురు హీరోయిన్లు
X

ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు అన్ స్టాపబుల్ సీజన్-2తో దుమ్ముదులుపుతున్నాడు బాలయ్య. ఇప్పటికే ప్రభాస్-గోపీచంద్ ను ఇంటర్వ్యూ చేసిన ఈ హీరో, ఇప్పుడు ఒకేసారి ముగ్గురు ముద్దుగుమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాడు. అంతేకాదు, ఆ ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతోంది.

బాలయ్య ఎదురుగా కూర్చోబోయే ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరో కాదు.. జయప్రద, జయసుధ, రాశిఖన్నా. ఇలా ఓ డిఫరెంట్ కాంబినేషన్ ను తెరపైకి తీసుకురాబోతున్నాడు బాలయ్య.

వీళ్లలో జయసుధ, జయప్రదతో సీనియర్ ఎన్టీఆర్ నటించారు కానీ బాలయ్య నటించలేదు. ఇటు రాశిఖన్నా ప్రస్తుతం లీడ్ లో ఉంది కానీ, బాలయ్యతో మాత్రం నటించలేదు. ఇలా తనతో కలిసి నటించని, ఆ తరం తారలు, ఈతరం హీరోయిన్ తో ముచ్చటించబోతున్నాడు బాలయ్య.

ప్రస్తుతం వీరసింహారెడ్డి పనుల్లో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఈ గ్యాప్ లోనే ఈ ముగ్గురు హీరోయిన్లతో ఓ ఎపిసోడ్ పూర్తి చేయబోతున్నాడు. త్వరలోనే ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటిస్తారు

First Published:  19 Dec 2022 6:30 AM GMT
Next Story