Telugu Global
Cinema & Entertainment

Balakrishna: నాకు డ్రీమ్ రోల్స్ లేవు

Balakrishna - తనకు ఎలాంటి డ్రీమ్ రోల్స్ లేవంటున్నాడు బాలకృష్ణ. ఎప్పటికప్పుడు వచ్చే పాత్రల్ని చేసుకుంటూ వెళ్లడమే తన పని అంటున్నాడు.

Balakrishna: నాకు డ్రీమ్ రోల్స్ లేవు
X

డ్రీమ్ రోల్ ఏంటని అడిగితే ప్రతి హీరో కొన్ని పాత్రల పేర్లు చెబుతాడు. ఫలానా పాత్ర చేయాలని ఉందంటూ మనసులో మాటలు బయటపెడుతుంటారు. అయితే హీరో బాలకృష్ణ మాత్రం వీటికి పూర్తి విరుద్ధం. తనకు డ్రీమ్ రోల్స్ లేవంటున్నాడాయన. దానికి ఓ లాజిక్ కూడా చెబుతున్నాడు.

"నాకు డ్రీమ్ రోల్స్ అంటూ ఏం లేవు. పాత్రలు వస్తుంటాయి, నచ్చుతాయి, చేస్తుంటాను. నటన అనేది ఓ విస్పోటనం. నచ్చిన పాత్రల్ని ఆవాహనం చేసుకోవడమే. అలాంటి పాత్రల్లోనే నా డ్రీమ్ రోల్స్ ఉంటాయి. ఆదిత్య-999-మ్యాక్స్ అనే సినిమా ఈ ఏడాదిలోనే స్టార్ట్ చేస్తున్నాం. అది కూడా నా డ్రీమ్ రోలే."

ఇలా పాత్రల విషయంలో ఎప్పటికప్పుడు తన డ్రీమ్స్ మారిపోతుంటాయనే విషయాన్ని బయటపెట్టారు బాలకృష్ణ. వీరసింహారెడ్డి సినిమాతో థియేటర్లలోకి వచ్చిన ఈ నటుడు, ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తమ సినిమా ఆకట్టుకుంటుందని అంటున్నారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. తమన్ సంగీతం అందించాడు.

First Published:  12 Jan 2023 6:57 AM GMT
Next Story