Telugu Global
Cinema & Entertainment

Balakrishna | చాలా దాచిపెట్టాం.. దబిడి దిబిడే

Balakrishna reveals - భగవంత్ కేసరి సినిమాలో చాలా మేటర్ ఉందంటున్నారు బాలకృష్ణ. కావాలనే చాలా దాచిపెట్టామని చెబుతున్నారు.

Balakrishna | చాలా దాచిపెట్టాం.. దబిడి దిబిడే
X

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్ ని నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడారు. సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భగవంత్ కేసరి సినిమాలో ఇప్పటివరకు అంతా ఒక గెటప్ మాత్రమే చూశారట. సినిమాలో మరో గెటప్ కూడా ఉందని ప్రకటించారు బాలకృష్ణ. ఆ గెటప్ గురించి చెప్పడానికి ప్రయత్నించగా, అనీల్ రావిపూడి వారించాడు. వెంటనే బాలయ్య ఆ టాపిక్ ఆపేశారు. సినిమాలోనే చూడాలంటూ ఊహించారు

ఇక శ్రీలీలతో తన కెమిస్ట్రీ బాగా కుదిరిందన్నారు బాలయ్య. తమ పెర్ఫార్మెన్స్ చూసి, ఆడమగా అనే తేడా లేకుండా అందరూ చప్పట్లు కొట్టి కన్నీళ్ళతో థియేటర్ నుంచి బయటికొస్తారని అన్నారు. ప్రతి సన్నివేశానికి లేచి చప్పట్లు కొడతారని, అంత అద్భుతంగా తమ మధ్య కెమిస్ట్రీ పండిందని అన్నారు.

ఇక అర్జున్ రాంపాల్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు బాలయ్య. తెలుగులో చేసిన తొలి సినిమాకే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్న అర్జున్ రాంపాల్ డెడికేషన్ ను మెచ్చుకున్నారు. ఇక సినిమాలో చాలా మేటర్ ఉందని, అంతా దాచిపెట్టామని, సినిమా చాలా కూల్ మొదలౌతుందని, ఆ తర్వాత దబిడి దిబిడే అంటూ అంచనాలు పెంచారు బాలయ్య.

First Published:  16 Oct 2023 2:35 AM GMT
Next Story