Telugu Global
Cinema & Entertainment

Balakrishna | నేను రామ్ ను ఫాలో అయ్యాను

Balakrishna Ram Pothineni - రామ్ పోతినేనికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు సీనియర్ హీరో బాలకృష్ణ.

Balakrishna | నేను రామ్ ను ఫాలో అయ్యాను
X

స్కంద ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ఆయన ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టారు. ఓ విషయంలో తను హీరో రామ్ ను ఫాలో అయినట్టు చెప్పుకున్నారు బాలయ్య.

ఇస్మార్ట్ శంకర్ సినిమా చేశాడు రామ్. అందులో పూర్తిస్థాయిలో తెలంగాణ యాసలో మాట్లాడాడు. దాన్ని ఆదర్శంగా తీసుకొని, భగవంత్ కేసరి సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడారట బాలయ్య. అలా తను రామ్ ను ఫాలో అయ్యానని చెప్పుకొచ్చారు.

అయితే ఇప్పుడు రామ్ తనను ఫాలో అవుతున్నాడని కూడా అన్నారు. భగవంత్ కేసరిలో తను పలికించిన తెలంగాణ యాస, స్టయిల్ ను డబుల్ ఇస్మార్ట్ కోసం రామ్ ఫాలో అవుతున్నాడని అన్నారు.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కింది స్కంద సినిమా. బోయపాటి-బాలయ్యకు మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. సింహా, లెజెండ్, అఖండ రూపంలో వీళ్లు హ్యాట్రిక్ కొట్టారు. ఆ అనుబంధంతోనే బోయపాటి ఆహ్వానించిన వెంటనే, ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వచ్చారు బాలయ్య.

First Published:  27 Aug 2023 3:00 PM GMT
Next Story