Telugu Global
Cinema & Entertainment

బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ ఇదే

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు వీరసింహారెడ్డి అనే టైటిల్ ప్రకటించారు. పనిలో పనిగా విడుదల తేదీని కూడా ఎనౌన్స్ చేశారు.

బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ ఇదే
X

వీరసింహారెడ్డి

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ కి పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'వీరసింహారెడ్డి' టైటిల్ ని ఖరారు చేశారు. టైటిల్‌ను వేలాది మంది అభిమానుల సమక్షంలో భారీగా లాంచ్ చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజుపై 3డి టైటిల్ పోస్టర్‌ ను లాంచ్ చేశారు మేకర్స్.




మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'వీరసింహారెడ్డి' టైటిల్ సరిగ్గా సూట్ అయింది. 'సింహా'పేరుతొ బాలకృష్ణ చేసిన మెజారిటీ సినిమాలు బ్లాక్‌ బస్టర్‌లుగా నిలిచాయి. ఆ సెంటిమెంట్ ను వీరసింహారెడ్డి కూడా కూడా కొనసాగిస్తుందని నమ్ముతున్నారు.

టైటిల్ పోస్టర్ లో ప్రత్యేకంగా రూపొందించిన ఆయుధంతో వేటకు సిద్ధమైన సింహంలా కనిపిస్తున్నాడు బాలయ్య. పులిచర్ల 4 కిలోమీటర్ల మైలురాయి ఉంది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు టైటిల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు నిర్మాతలు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మరో 20 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. వచ్చేనెలలో ఈ సినిమా సంక్రాంతి విడుదల తేదీని ప్రకటిస్తారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.



First Published:  22 Oct 2022 12:50 PM GMT
Next Story