Telugu Global
Cinema & Entertainment

ఈవారంలోనే బాలయ్య కొత్త సినిమా టైటిల్ ప్రకటన

బాలకృష్ణ కొత్త సినిమాకు రెడ్డి గారు అనే టైటిల్ పెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఈ వారంలోనే ప్రకటన రానుంది.

ఈవారంలోనే బాలయ్య కొత్త సినిమా టైటిల్ ప్రకటన
X

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు బాలయ్య. షూటింగ్ దాదాపు కొలిక్కి వచ్చేసింది. కానీ సినిమా టైటిల్ మాత్రం ఇప్పటివరకు ప్రకటించలేదు. బాలయ్య నటించిన ఓ సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటన ప్రాసెస్ ను ఇంత ఆలస్యం చేయడం ఇదే తొలిసారి.

ఇంతకీ బాలయ్య కొత్త సినిమాకు ఏం టైటిల్ పెడుతున్నారు? మొన్నటివరకు చాలా టైటిల్స్ పై ప్రచారం జరిగింది. ఫైనల్ గా 2 టైటిల్స్ ను ఎంపిక చేశారు. వాటిలోంచి ఓ టైటిల్ ను ఈ వారంలో ఫైనలైజ్ చేసి, ప్రకటించబోతున్నారు.

బాలయ్య, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రెడ్డిగారు, వీరసింహారెడ్డి అనే టైటిల్స్ ఫైనలైజ్ అయ్యాయి. వీటిలో రెడ్డి గారు అనే టైటిల్ ను సినిమాకు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారంలోనే ఈ సస్పెన్స్ కు తెరపడుతుంది.

నిజానికి వీరసింహారెడ్డి అనే టైటిల్ రొటీన్ గా ఉంది. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు నుంచి ఇలాంటి టైటిల్స్ వింటున్నాం. రెడ్డిగారు అనే టైటిల్ కూడా రొటీన్ అయినప్పటికీ, సౌండింగ్ లో కాస్త కొత్తదనం ఉంది. కాబట్టి ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసే అవకాశం ఉంది.

First Published:  11 Oct 2022 3:24 AM GMT
Next Story